Breaking News

యువ మహిళా క్రికెటర్లకు తోడ్పాటు

Published on Thu, 01/29/2026 - 13:09

సాక్షి, ఆదిలాబాద్‌: యువతులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ‘హిమాలయ వెల్‌నెస్’ ముందడుగు వేసింది. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘1డెర్‌వుమన్ అకాడమీ’ని ప్రారంభించింది. ఈ అకాడమీ ద్వారా యువ మహిళా క్రికెట్ ఆశావహులను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా జట్టు ఆటగాళ్లతో మాట్లాడే అవకాశం కల్పిస్తోంది. వంద మందికి స్కాలర్‌షిప్‌లను కూడా అందించనుంది.

క్రికెట్‌కు సంబంధించిన విలువైన సూచనలు, మార్గనిర్దేశం ఒక ఇంటరాక్టివ్ చాట్‌బాట్ రూపంలో అందిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అకాడమీ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్స్ అందించనున్నారు. తుది అసైన్‌మెంట్‌నే స్కాలర్‌షిప్ దరఖాస్తుగా పరిగణించనున్నారు. ఇలాంటి డిజిటల్ వేదికకే పరిమితం కాకుండా ఫీమేల్ క్రికెట్ అకాడమీతో కలిసి ఒక ప్రత్యేక క్రికెట్ టోర్నమెంట్‌ కూడా నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.

ఈ టోర్నమెంట్‌కు 200కు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. అందులో 25 మంది యువ బాలికలు ఆర్సీబీ జట్టును ప్రత్యక్షంగా కలిసే అవకాశం పొందారన్నారు. మహిళా క్రికెట్ దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న ఈ సమయంలో 1డెర్‌వుమన్ అకాడమీ యువ బాలికలు చరిత్రను కేవలం చూడటానికే కాకుండా, ఆ చరిత్రలో భాగస్వాములయ్యే అవకాశం కల్పిస్తోందని పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)