Breaking News

చరిత్ర సృష్టించిన ఐపీఎల్‌ 2025 ఫైనల్‌ మ్యాచ్‌.. పాత రికార్డులన్నీ బద్దలు

Published on Fri, 06/20/2025 - 08:32

వ్యూయర్షిప్‌ విషయంలో ఆర్సీబీ, పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్‌ 2025 ఫైనల్‌ మ్యాచ్‌ రికార్డులను తిరగరాసింది. క్రికెట్ చరిత్రలో అత్యధికంగా వీక్షించబడిన టీ20 మ్యాచ్‌గా చరిత్ర సృష్టించింది. ఈ హై ఓల్టేజీ మ్యాచ్‌ వీక్షణ సమయం 31.7 బిలియన్ నిమిషాలు అని అధికారిక టీవీ మరియు డిజిటల్ ప్రసారకులు జియోస్టార్ గురువారం తెలిపారు. టీవీ మరియు డిజిటల్ వ్యూయర్షిప్ చరిత్రలో ఇది సరికొత్త రికార్డు.

టీవీ వ్యూయర్షిప్‌కు (స్టార్ స్పోర్ట్స్) సంబంధించి ఈ మ్యాచ్‌ అత్యధిక రీచ్‌ (169 మిలియన్ల వీక్షకులు మరియు 15 బిలియన్ నిమిషాల వీక్షణ సమయం) నమోదు చేసిన టీ20 మ్యాచ్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 

జియో హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్ డిజిటల్ చరిత్రను తిరిగరాసింది. 892 మిలియన్ వీడియో వ్యూస్, 55 మిలియన్ల పీక్ కంకరెన్సీ, 16.74 బిలియన్ నిమిషాల వీక్షణ సమయంతో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద టీ20 మ్యాచ్‌గా అవతరించింది.

ఈ ఒక్క మ్యాచే కాకుండా సీజన్‌ మొత్తంలో ప్రసారకులు కొత్త గరిష్టాలను నమోదు చేశారు. వీక్షకుల సంఖ్య టెలివిజన్ మరియు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. 840 బిలియన్ నిమిషాలకు పైగా  వీక్షణ సమయాన్ని నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.

డిజిటల్‌లో జియోహాట్‌స్టార్ 23.1 బిలియన్లకు పైగా వీక్షణలు మరియు 384.6 బిలియన్ నిమిషాల వాచ్-టైమ్‌తో కొత్త బెంచ్‌మార్క్‌లను నెలకొల్పింది. ఇది డిజిటల్ వీక్షణలో సంవత్సరానికి 29% పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. కనెక్టెడ్ టీవీ (CTV) వినియోగంలో పదునైన పెరుగుదల ఈ ఊపుకు దారితీసింది. ఈ ఒక్కటే 49 శాతం పెరిగింది. ఇది భారతదేశంలో పెద్ద స్క్రీన్ డిజిటల్ వీక్షణ వృద్ధిని నొక్కి చెబుతుంది. 

టీవీలో స్టార్ స్పోర్ట్స్ 456 బిలియన్ నిమిషాల వాచ్ టైమ్‌ను పొందిం అత్యధిక రేటింగ్‌ను నమోదు చేసింది.

కాగా, జూన్‌ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్‌ 2025 సీజన్‌ ఫైనల్లో ఆర్సీబీ పంజాబ్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించి తమ తొలి ఐపీఎల్‌ టైటిల్‌ను గెలుచుకుంది.

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)