Breaking News

RCB VS CSK: రాకాసి సిక్సర్‌ బాదిన జడేజా.. క్లాసెన్‌, రసెల్‌ కూడా సాధ్యం కాలేదు..!

Published on Sun, 05/04/2025 - 13:01

సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో అత్యంత భారీ సిక్సర్‌ (109 మీటర్లు) కొట్టాడు. నిన్న (మే 3) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో జడ్డూ  ఈ ఘనత సాధించాడు. ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ ఐదో బంతికి (ఛేదనలో) లుంగి ఎంగిడి వేసిన ఫుల్‌ టాస్‌ బంతిని జడేజా స్టేడియం పైకప్పు పైకి పంపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

జడేజా బాదిన ఈ సిక్సర్‌కు ముందు ఈ సీజన్‌లో అత్యంత భారీ సిక్సర్‌ రికార్డు సన్‌రైజర్స్‌ ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ పేరిట ఉండేది. క్లాసెన్‌ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 మీటర్ల సిక్సర్‌ బాదాడు. క్లాసెన్‌ తర్వాత ఈ సీజన్‌ బిగ్గెస్ట్‌ సిక్సర్ల రికార్డు ఆండ్రీ రసెల్‌, అభిషేక్‌ శర్మ పేరిట ఉంది. రసెల్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌పై.. అభిషేక్‌ పంజాబ్‌పై 106 మీటర్ల భారీ సిక్సర్లు కొట్టారు. ఈ సీజన్‌లో ఐదో భారీ సిక్సర్‌ రికార్డు ఆర్సీబీ ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ పేరిట ఉంది. సాల్ట్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 105 మీటర్ల సిక్సర్‌ కొట్టాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆయుశ్‌ మాత్రే (48 బంతుల్లో 94; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ద సెంచరీలతో చెలరేగినా ఆర్సీబీ చేతిలో సీఎస్‌కే 2 పరుగుల స్వల్ప తేడాతో ఓడింది.

చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. జేకబ్‌ బేతెల్‌ (33 బంతుల్లో 55; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్‌ కోహ్లి (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రొమారియో షెపర్ట్‌ (14 బంతుల్లో 53 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.

సీఎస్‌కే బౌలర్లలో పతిరణ (4-0-36-3), నూర్‌ అహ్మద్‌ (4-0-26-1) అద్భుతంగా బౌలింగ్‌ చేయగా.. ఖలీల్‌ అహ్మద్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు (3-0-65-0). ఖలీల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో షెపర్డ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 33 పరుగులు పిండుకున్నాడు. పతిరణ వేసిన చివరి ఓవర్‌లోనూ అదే జోరు కొనసాగించిన షెపర్డ్‌ ఆ ఓవర్‌లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రాబట్టాడు.

అనంతరం 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్‌కే.. చివరి బంతి వరకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులకే పరిమితమైంది. ఆయుశ్‌ మాత్రే, రవీంద్ర జడేజా సీఎస్‌కేను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు.

సీఎస్‌కే గెలుపుకు చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా.. యశ్‌ దయాల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫలితంగా సీఎస్‌కే లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. దయాల్‌, కృనాల్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.  

ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్‌కే ఈ ఓటమితో చివరి స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దాదాపుగా ఖరారైనట్లే.

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)