Breaking News

‘ఈ విజయం మీ అందరిది’

Published on Thu, 06/05/2025 - 02:09

సాక్షి, బెంగళూరు: తొలిసారి ఐపీఎల్‌ టైటిల్‌ గెలుచుకున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) తమ హోం గ్రౌండ్‌లో వేడుకలు జరుపుకుంది. బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జట్టు సభ్యులంతా పాల్గొని అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ‘ఈ సాల కప్‌ నమ్‌దు’ అంటూ విరాట్‌ కోహ్లి తనదైన శైలిలో ఫ్యాన్స్‌లో జోష్‌ నింపాడు. 

‘ఈ విజయం మీ అందరిదీ. అభిమానులు, ఈ నగరానికి చెందినవారు, కష్టాల్లోనూ జట్టుకు మద్దతునిచ్చిన వారందరికీ గెలుపులో భాగం ఉంది. ప్రపంచంలో ఏ ఫ్రాంచైజీ జట్టుకు కూడా ఇంతటి వీరాభిమానులు ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. సీజన్‌ ఆరంభం నుంచి జట్టులోని ఆటగాళ్లంరికీ తగిన బాధ్యతలు అప్పగించామని, ఇప్పుడు వారందరి ప్రదర్శనతోనే టైటిల్‌ విజయం ఖాయమైందని కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌ చెప్పాడు. 

అంతకుముందు ఆర్‌సీబీ టీమ్‌ సభ్యులు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విధాన సౌధ వద్ద క్రికెటర్లకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం జరిగింది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సాంప్రదాయ రీతిలో వారిని సత్కరించారు. ఆర్‌సీబీ టీమ్‌ తమ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని, 18 ఏళ్లు టైటిల్‌ కోసం పోరాడటం చిన్న విషయం కాదని ఆయన అన్నారు.  

విజయాన్ని అలవాటుగా మార్చుకోవాలి... 
ఒక్క టైటిల్‌ విజయంతో ఆర్‌సీబీ జట్టు ఆగిపోరాదని, వచ్చే ఏడాది కూడా ఇదే జోరును కొనసాగించి వరుసగా రెండో ఏడాది ట్రోఫీని సొంతం చేసుకోవాలని టీమ్‌ డైరెక్టర్‌ మొ బొబాట్‌ అన్నారు. ఫైనల్లో విజయం తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో సంబరాలు చేసుకుంటూ ఆయన టీమ్‌ సభ్యుల్లో మరింత స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు.

‘ఈ అద్భుత విజయంలో అందరూ తమవంతు పాత్ర పోషించారు. దీని విలువ ఏమిటో రాబోయే రోజుల్లో ఇంకా మీకు అర్థమవుతుంది. గతంలో ఒక జట్టు వరుసగా రెండుసార్లు టైటిల్‌ గెలవడం రెండుసార్లు మాత్రమే జరిగింది. వచ్చే ఏడాది ఫైనల్‌ బెంగళూరులో జరుగుతుంది. అప్పుడు అక్కడా మనం ఉండాలంటే విజయాలను అలవాటుగా మార్చుకోవాలి. ఈ టైటిల్‌ మీలో గెలుపు ఆకలిని ఇంకా పెంచాలి’ అని బొబాట్‌ వ్యాఖ్యానించారు.

‘బౌలింగ్‌ వల్లే గెలిచాం’
ఐపీఎల్‌ టైటిల్‌ను ఆర్‌సీబీ తొలిసారి గెలవడంలో బౌలర్లే ప్రధాన పాత్ర పోషించారని జట్టు హెడ్‌ కోచ్‌ ఆండీ ఫ్లవర్‌ అన్నారు. వేలంలో కూడా మంచి బౌలర్లను సొంతం చేసుకోవడంపైనే దృష్టి పెట్టామని... గెలుపు దిశగా అక్కడే తమ తొలి అడుగు పడిందని ఫ్లవర్‌ వ్యాఖ్యానించారు. 

‘పేరున్న బ్యాటర్లపై భారీ మొత్తాలు వెచ్చించడంకంటే గుర్తింపు ఉన్న బౌలర్లను ఎంచుకోవడం ముఖ్యమని భావించాం. తొలిరోజు వేలం ముగిశాక మాపై చాలా విమర్శలు వచ్చాయి. అయితే రెండో రోజు వేలంలో భువనేశ్వర్, కృనాల్, సుయాశ్‌ శర్మలను తీసుకున్నాం. వీరు ఎలాంటి ప్రభావం చూపించారో ఇప్పుడు కనిపిస్తోంది’ అని ఫ్లవర్‌ విశ్లేషించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)