Breaking News

కోహ్లి టీమ్‌లో చేరిన ధోని నేస్తం.. KGFపై భారం తగ్గిస్తాడా..?

Published on Mon, 05/01/2023 - 18:13

మహేంద్రసింగ్‌ ధోని స్నేహితుడు, మాజీ సీఎస్‌కే సభ్యుడు కేదార్‌ జాదవ్‌ను ఆర్సీబీ తమ జట్టులో చేర్చుకుంది. గత మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన డేవిడ్‌ విల్లేకు రీప్లేస్‌మెంట్‌గా జాదవ్‌ ఆర్సీబీలోకి వచ్చాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం సోమవారం (మే 1) ప్రకటించింది. 38 ఏళ్ల జాదవ్‌ను ఐపీఎల్‌ వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. జాదవ్‌ సేవలను ఆర్సీబీ కోటి రూపాయలు వెచ్చించి దక్కించుకుంది. 

చదవండి: సంజూ చీటింగ్‌ చేశాడా.. రోహిత్‌ శర్మకు అన్యాయం!? video

2010లో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన జాదవ్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌, కొచ్చి టస్కర్స్‌, ఆర్సీబీ, సీఎస్‌కే, సన్‌రైజర్స్‌ తరఫున 93 మ్యాచ్‌ల్లో 123.17 స్ట్రయిక్‌ రేట్‌తో 1196 పరుగులు చేశాడు. జాదవ్‌ 2016, 2017 సీజన్లలో ఆర్సీబీ తరఫున 17 మ్యాచ్‌లు ఆడి అద్భుతంగా రాణించాడు (143.54 స్ట్రయిక్‌ రేట్‌తో 267 పరుగులు). జాదవ్‌ రాకతో ఆర్సీబీ బ్యాటింగ్‌ బలం పెరుగుతుందని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తుంది. జాదవ్‌ జట్టులో చేరడం వల్ల KGF (కోహ్లి, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ఫాఫ్‌ డుప్లెసిస్‌)పై భారం తగ్గుతుందని ఆర్సీబీ అంచనా వేస్తుంది.

జాదవ్‌కు పార్ట్‌ టైమ్‌ స్పిన్‌ బౌలర్‌గా సత్తా చాటే సామర్థ్యం కూడా ఉంది. అయితే ఐపీఎల్‌లో మాత్రం అతను ఎప్పుడూ బౌలింగ్‌ చేయలేదు. జాదవ్‌ మంచి వికెట్‌కీపర్‌ కూడా. జాదవ్‌కు ధోనికి మంచి స్నేహం ఉందని క్రికెట్‌ సర్కిల్స్‌లో టాక్‌ ఉంది. ధోని సీఎస్‌కే యాజమాన్యాన్ని ఒప్పించి మరీ అప్పట్లో జాదవ్‌ను  జట్టులోకి తీసుకున్నట్లు టాక్‌ నడిచింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్‌లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇవాళ (మే 1) ఆ జట్టు లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడనుంది. 

చదవండి: జడేజాను ట్రై చేశారు.. కానీ ఏం లాభం? కెప్టెన్‌గా అతడే సరైనోడు: పాక్‌ దిగ్గజం

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)