Breaking News

రాయలసీమ కింగ్స్‌ ‘హ్యాట్రిక్‌’ విజయం

Published on Mon, 08/21/2023 - 07:32

విశాఖ స్పోర్ట్స్‌: ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ టి20 టోర్నమెంట్‌ రెండో సీజన్‌లో రాయలసీమ కింగ్స్‌ జట్టు వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసింది. ఇక్కడి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్‌ ఐదు వికెట్ల తేడాతో గోదావరి టైటాన్స్‌ జట్టును ఓడించింది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో రాయలసీమ కింగ్స్‌ 12 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో ఉంది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన గోదావరి టైటాన్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 150 పరుగులు చేసింది. త్రిపురాణ విజయ్‌ (25 బంతుల్లో 63 నాటౌట్‌; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అజేయ అర్ధ సెంచరీ చేశాడు. రాయలసీమ కింగ్స్‌ బౌలర్లలో హరిశంకర్‌ రెడ్డి మూడు వికెట్లు, గిరినాథ్‌ రెడ్డి రెండు వికెట్లు తీశారు. అనంతరం రాయలసీమ కింగ్స్‌ 17.4 ఓవర్లలో 5 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. కెపె్టన్‌ హనుమ విహారి (12 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్‌), అభిషేక్‌ రెడ్డి (37 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), తన్నీరు వంశీకృష్ణ (39 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. గోదావరి టైటాన్స్‌ బౌలర్లు ఏకంగా 21 ఎక్స్‌ట్రాలు ఇవ్వడం గమనార్హం.  


తపస్వి ఆల్‌రౌండ్‌ ప్రదర్శన 
మరో మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర లయన్స్‌ 93 పరుగుల తేడాతో వైజాగ్‌ వారియర్స్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా ఉత్తరాంధ్ర లయన్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. కెపె్టన్‌ కోన శ్రీకర్‌ భరత్‌ (23 బంతుల్లో 45; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), వెంకట్‌ రాహుల్‌ (36 బంతుల్లో 53; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), పిన్నింటి తపస్వి (23 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), సిర్లా శ్రీనివాస్‌ (13 బంతుల్లో 33 నాటౌట్‌; 1 ఫోర్, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. అనంతరం వైజాగ్‌ వారియర్స్‌ 14.4 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. తపస్వి, పృథీ్వరాజ్‌ మూడు వికెట్ల చొప్పున తీశారు.    

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)