Breaking News

అశ్విన్ ఊచకోత.. సిక్సర్ల వర్షం! వీడియో వైర‌ల్‌

Published on Thu, 08/01/2024 - 09:35

తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టిఎన్‌పిఎల్)-2024లో దిండిగల్ డ్రాగన్స్ క్వాలిఫియర్‌-2కు ఆర్హత సాధించింది. దిండిగల్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో చెపాక్ సూపర్ గిల్స్‌పై 4 వికెట్ల తేడాతో డ్రాగన్స్ విజయం సాధించింది. ఈ విజయంలో ఆ జట్టు కెప్టెన్‌, భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. 

తొలుత బౌలింగ్‌లో విఫలమైన అశ్విన్‌.. బ్యాటింగ్‌లో మాత్రం దుమ్ములేపాడు. 159 పరుగుల లక్ష్య చేధనలో అశ్విన్ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు.  కళ్లు చెదిరే షాట్లను అశ్విన్ ఆడాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్.. ఓపెనర్ శివమ్ సింగ్‌తో కలిసి 112 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

 ఓవ‌రాల్‌గా 35 బంతులు ఎదుర్కొన్న అశ్విన్‌.. 4 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 57 ప‌రుగులు చేసి ఔటయ్యాడు. అశ్విన్‌తో పాటు శివమ్ సింగ్‌(64) అద్బుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫ‌లితంగా  159 పరుగుల ల‌క్ష్యాన్ని దిండిగల్ డ్రాగన్స్ 19.5 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. 

అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన చెపాక్ సూపర్ గిల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 158 ప‌రుగ‌లు చేసింది. చెపాక్ సూపర్ గిల్స్ బ్యాట‌ర్లలో కెప్టెన్ అప‌రజిత్‌(72) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఇక ఆగ‌స్టు 2న జ‌ర‌గ‌నున్న క్వాలిఫియ‌ర్‌-2లో ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిజన్స్‌తో  దిండిగల్ డ్రాగన్స్ త‌ల‌ప‌డ‌నుంది.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)