రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న అశ్విన్‌! వీడియో

Published on Mon, 04/28/2025 - 20:46

టీమిండియా మ‌జీ క్రికెట‌ర్ రవిచంద్రన్ అశ్విన్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప‌ద్మ‌శ్రీ అవార్డును అందుకున్నాడు. సోమ‌వారం (April 28)  రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో.. ఈ అవార్డును అశ్విన్ స్వీక‌రించాడు. ఈ కార్యక్రమానికి  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు. 

కాగా భార‌త క్రికెట్‌కు అందించిన సేవ‌ల‌కు గాను అశ్విన్‌కు ఈ అరుదైన గౌర‌వం ల‌భించింది. ఈ ప్రత్యేక గౌరవం పొందినందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అశ్విన్‌ను ప్రశంసించింది. "భారత రాష్ట్రపతి  చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును అందుకున్న అశ్విన్‌కు అభినందనలు. 

ఇది అత‌డి కెరీర్‌లో సాధించిన అద్బుత విజ‌యాల‌కు ద‌క్కిన గౌర‌వ‌మ‌ని" బీసీసీఐ ఎక్స్‌లో రాసుకొచ్చింది.  అశ్విన్ త‌న 15 ఏళ్ల కెరీర్‌లో భార‌త్ త‌ర‌పున 287 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 106 టెస్టులు, 116 వ‌న్డేలు, 65 టీ20లు ఉన్నాయి. 106 టెస్టుల్లో అశ్విన్ 537 వికెట్లు ప‌డ‌గొట్టాడు. భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా ఈ త‌మిళ‌నాడు క్రికెట‌ర్ కొన‌సాగుతున్నాడు. వ‌న్డేల్లో 156 వికెట్లు, టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు. 

అశ్విన్‌తో పాటు భారత హాకీ దిగ్గజం పిఆర్ శ్రీజేష్‌ను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త్‌ కాంస్య పతకాన్ని గెలుచుకోవడంలో శ్రీజేష్ కీల‌క పాత్ర పోషించాడు. పారిస్ ఒలింపిక్స్ అనంత‌రం శ్రీజేష్ హాకీకి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు.
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)