‘ధోనికి రుణపడి ఉంటా’అశ్విన్‌ భావోద్వేగం 

Published on Sun, 03/17/2024 - 04:21

చెన్నై: దాదాపు 13 ఏళ్ల క్రితం తనకంటూ ఎలాంటి గుర్తింపు లేని రోజుల్లో అండగా నిలిచి అవకాశాలు కల్పించిన మహేంద్ర సింగ్‌ ధోనికి తాను జీవితకాలం రుణపడి ఉంటానని భారత స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. 100 టెస్టులు పూర్తి చేసుకోవడంతో పాటు 500 వికెట్ల మైలురాయిని దాటిన అశ్విన్‌ను శనివారం తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌సీఏ) ఘనంగా సన్మానించింది.

ఈ సందర్భంగా తన కెరీర్‌ను మలుపు తిప్పిన 2011 ఐపీఎల్‌ ఫైనల్‌ను అశ్విన్‌ గుర్తు చేసుకున్నాడు. ‘కొత్త బంతితో నన్ను క్రిస్‌ గేల్‌కు బౌలింగ్‌ చేసే అవకాశాన్ని ధోని కల్పించాడు. నాలుగో బంతికే నేను వికెట్‌ తీయగలిగా. ఇప్పటికీ చాలా మంది దాని గురించి మాట్లాడుకుంటున్నారంటే అందుకు ధోనినే కారణం. అతనికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. సాధారణంగా నేను మాట్లాడేప్పుడు పదాల కోసం ఎప్పుడూ తడబడను.

కానీ ఈ రోజు నా పరిస్థితి భిన్నంగా ఉంది. టీఎన్‌సీఏ నాకు ఎంతో గౌరవం కల్పించింది కాబట్టే ఎప్పుడైనా క్లబ్‌ క్రికెట్‌ కూడా సిద్ధంగా ఉంటా. నేను రేపు చచ్చిపోయినా నా ఆత్మ ఈ స్టేడియంలోనే తిరుగుతూ ఉంటుంది’ అని అశ్విన్‌ అన్నాడు. ఈ సన్మాన కార్యక్రమంలో అశ్విన్‌కు ప్రత్యేక జ్ఞాపికగా ‘సెంగోల్‌’ అందించడం, అతని పేరిట స్టాంప్‌ విడుదలతో పాటు రూ. 1 కోటి నగదు పురస్కారాన్ని కూడా అందించారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)