Breaking News

అతడొక వరల్డ్‌క్లాస్‌ స్పిన్నర్‌.. కుంబ్లే, అశ్విన్‌ కంటే: మురళీధరన్

Published on Mon, 12/04/2023 - 15:06

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో భారత యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐదు మ్యాచ్‌లు ఆడిన బిష్ణోయ్‌ 9 వికెట్లు పడగొట్టి.. భారత్‌ తరపున లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. ఈ ఐదు మ్యాచ్‌ల్లో కూడా తొలి ఓవర్‌లోనే భారత్‌కు బిష్ణోయ్‌ వికెట్‌ అందించాడు. ఈ నేపథ్యంలో  బిష్ణోయ్‌పై శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ ప్రశంసల వర్షం కురిపించాడు.

భారత గ్రేట్‌ స్పిన్నర్లు అనిల్‌ కుంబ్లే, రవిచంద్రన్‌ అశ్విన్‌లతో బిష్ణోయ్‌ను పోల్చాడు . "భారత్‌ క్రికెట్‌లో ప్రతీ తరానికి మంచి స్పిన్నర్లు పుట్టుకొస్తున్నారు. అనిల్‌ కుంబ్లే నుంచి అశ్విన్‌ వరకు అత్యుత్తమ స్పిన్నర్లు మనం చూశాం. ఇప్పుడు రవి బిష్ణోయ్‌ రూపంలో భారత్‌కు మరో వరల్డ్‌క్లాస్‌ స్పిన్నర్‌ దొరికాడు. బిష్ణోయ్‌కు అద్బుతమైన స్కిల్స్‌ ఉన్నాయి.

మిగతా లెగ్‌ స్పిన్నర్ల కంటే బిష్ణోయ్‌ చాలా భిన్నం. అతడికి బంతిని వేగంగా వేసే సత్తా ఉంది. బంతిని టర్న్‌ కూడా చేయగలడు. అదే అక్షర్‌ కూడా సరైన వేగంతో బౌలింగ్‌ చేయగలడు, కానీ టర్న్‌ పెద్దగా ఉండదు. వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్ కూడా అక్షర్‌ మాదరిగానే ఉంటుందని" ఓ ఇంటర్వ్యూలో ముత్తయ్య పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ కూడా భారత జట్టులో బిష్ణోయ్‌కు చోటు దక్కింది.
చదవండి: భారత్‌తో సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. కెప్టెన్‌కు షాక్‌

Videos

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)