Breaking News

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన! స్టార్‌ బ్యాటర్‌ వచ్చేశాడు

Published on Thu, 01/19/2023 - 10:05

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ కోసం 16 ‍మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్‌ సౌతాఫ్రికా ప్రకటించింది. ఈ జట్టుకు టెంబా బావుమా సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా ఆల్‌రౌండర్లు మార్కో జాన్‌సెన్‌, సిసంద మగలకు వన్డే జట్టులో చోటు దక్కింది. ఇక గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న ప్రోటీస్‌ స్టార్‌ బ్యాటర్‌ వాన్ డెర్ డస్సెన్ ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు.

ఇక ఈ సిరీస్‌కు ఎంపికైన ప్రోటీస్‌ సీనియర్‌ ఆటగాళ్లు క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, జన్నెమాన్ మలన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్ ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా ఉన్నారు. అయితే సిరీస్‌ సమయానికి వీరంతా జట్టుతో కలవనున్నారు. ఇక జనవరి 27న బ్లోమ్‌ఫోంటెయిన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్‌ ఆరంభం కానుంది.  కాగా భారత్‌ వేదికగా ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్‌ ప్రోటీస్‌కు చాలా కీలకం.

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ప్రోటీస్‌ జట్టు: టెంబా బావుమా (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, సిసంద మగలా, కేశవ్ మహరాజ్, జన్నెమాన్ మలన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్జే, వేన్ పార్నెల్, షమ్సీ, వాన్ డెర్ డస్సెన్
చదవండి:
 IND vs NZ: నేను అనుకున్నది జరగలేదు.. అతడు మాత్రం భయపెట్టాడు: రోహిత్‌ శర్మ

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)