Breaking News

ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా ర‌షీద్ ఖాన్‌..

Published on Fri, 12/20/2024 - 19:35

సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 సీజ‌న్‌కు ముందు ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ ఫ్రాంచైజీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ జ‌ట్టు కెప్టెన్‌గా అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్‌ను ముంబై కేప్ టౌన్ తిరిగి నియ‌మించింది. కాగా  తొట్ట తొలి సీజ‌న్‌లో ముంబై కేప్ టౌన్ కెప్టెన్‌గా వ్య‌వ‌హరించిన ర‌షీద్‌.. గాయం కార‌ణంగా రెండో సీజ‌న్‌కు దూర‌మ‌య్యాడు.

ఇప్పుడు వ‌చ్చే ఏడాది సీజ‌న్‌కు అత‌డు అందుబాటులోకి రావ‌డంతో మ‌రోసారి కేప్‌టౌన్ జ‌ట్టును ముందుండి న‌డిపించ‌నున్నాడు. తొలి సీజ‌న్‌లో అత‌డి సారథ్యంలోని కేప్ టౌన్ జ‌ట్టు దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్ధానంలో నిలిచి గ్రూపు స్టేజిలోనే ర‌షీద్ జ‌ట్టు ఇంటిముఖం ప‌ట్టింది. రెండో సీజ‌న్‌లో కూడా ముంబై త‌ల‌రాత మార‌లేదు.

రషీద్ స్ధానంలో ముంబై కేప్ టౌన్ కెప్టెన్‌గా విండీస్ దిగ్గ‌జం కిరాన్ పొలార్డ్ వ్య‌వ‌హ‌రించాడు. రెండో సీజ‌న్‌లో కూడా ముంబై జ‌ట్టు పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్ధానానికే ప‌రిమిత‌మైంది. క‌నీసం మూడో స్ధానంలోనైనా ముంబై కేప్ టౌన్ త‌ల‌రాత మారుతుందో లేదో చూడాలి.

కాగా ఎస్ఏ 20-2025 సీజ‌న్‌కు ముందు ముంబై ఫ్రాంచైజీ ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ముంబై కేప్‌టౌన్ జ‌ట్టులో స్టోక్స్‌తో పాటు ట్రెంట్ బౌల్ట్‌, కగిసో ర‌బాడ వంటి స్టార్ ప్లేయ‌ర్లు ఉన్నారు. కాగా ముంబై కేప్‌టౌన్‌ జట్టు ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌ యాజమాన్యానికి చెందినదే అన్న విషయం తెలిసిందే.  ఇక ఎస్ఎ టీ20 లీగ్ మూడో సీజ‌న్ జ‌న‌వ‌రి 9, 2025న ప్రారంభం కానుంది.

ఎస్‌ఏ20 2025 ఎడిషన్‌ కోసం ఎంఐ కేప్‌టౌన్‌ జట్టు..
బెన్‌ స్టోక్స్‌, రషీద్‌ ఖాన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, నువాన్‌ తుషార, క్రిస్‌ బెంజమిన్‌, కగిసో రబాడ, డెవాల్డ్‌ బ్రెవిస్‌, రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌, ర్యాన్‌ రికెల్టన్‌, జార్జ్‌ లిండే, డెలానో పాట్‌గెయిటర్‌, థామస్‌ కేబర్‌, కానర్‌ ఎస్టర్‌హ్యుజెన్‌
చదవండి: అశ్విన్‌కు వచ్చే పెన్షన్ ఎంతో తెలుసా?

 

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)