Breaking News

Ranji Trophy: విజయం దిశగా హైదరాబాద్‌

Published on Tue, 02/20/2024 - 00:58

సాక్షి, హైదరాబాద్‌: మరో 127 పరుగులు సాధిస్తే హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టు 2023–2024 రంజీ ట్రోఫీ ప్లేట్‌ డివిజన్‌ చాంపియన్‌గా అవతరిస్తుంది. ఇక్కడి ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న ప్లేట్‌ డివిజన్‌ టైటిల్‌ పోరులో మేఘాలయ జట్టు హైదరాబాద్‌కు 198 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్‌ రెండో ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి 71 పరుగులు సాధించింది.

తన్మయ్‌ అగర్వాల్‌ (0) ఖాతా తెరవకుండా అవుటవ్వగా... రాహుల్‌ సింగ్‌ గహ్లోత్‌ (29 బంతుల్లో 50 బ్యాటింగ్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), తనయ్‌ త్యాగరాజన్‌ (35 బంతుల్లో 17 బ్యాటింగ్‌; 1 ఫోర్‌) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 0/1తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన మేఘాలయ జట్టు 71.3 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ ఆర్‌ఆర్‌ బిస్వా (100; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు)

సెంచరీ సాధించగా... జస్కీరత్‌ (81; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్‌ ఎడంచేతి వాటం స్పిన్నర్‌ తనయ్‌ త్యాగరాజన్‌ 86 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి మేఘాలయను కట్టడి చేశాడు. ఈ రంజీ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన తనయ్‌ మొత్తం 56 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. తనయ్‌ ఏడుసార్లు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)