Breaking News

దుమ్ములేపిన తిలక్‌ సేన.. చాంపియన్‌గా హైదరాబాద్‌

Published on Tue, 02/20/2024 - 13:26

రంజీ ట్రోఫీ 2023-24 ప్లేట్‌ గ్రూప్‌ ఫైనల్లో హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టు ఘన విజయం సాధించింది. మేఘాలయ టీమ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌ విజేతగా నిలిచింది. హైదరాబాద్‌- మేఘాలయ మధ్య రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో ఫిబ్రవరి 17న మ్యాచ్‌ మొదలైంది.

టాస్‌ గెలిచిన మేఘాలయ తొలుత బ్యాటింగ్‌ చేసింది. 83 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్‌ అయింది. హైదరాబాద్‌ స్పిన్నర్‌ తనయ్‌ త్యాగరాజన్‌ 5 వికెట్లతో చెలరేగగా.. రోహిత్‌ రాయుడు మూడు, రిషభ్‌ బస్లాస్‌, కెప్టెన్‌ తిలక్‌ వర్మ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

ఈ క్రమంలో హైదరాబాద్‌ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 350 పరుగులు చేసింది. కె.నితేశ్‌రెడ్డి సెంచరీ(122)తో ఆకట్టుకోగా.. వికెట్‌ కీపర్‌ ప్రజ్ఞయ్‌రెడ్డి అజేయ శతకం(141 బంతుల్లో 102 పరుగులు) సాధించాడు. మరోవైపు.. కెప్టెన్‌ తిలక్‌ వర్మ 44 పరుగులతో రాణించాడు. ఫలితంగా మేఘాలయ కంటే తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం సంపాదించింది హైదరాబాద్‌.

ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన మేఘాలయను లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ తనయ్‌ త్యాగరాజన్‌ మరోసారి దెబ్బకొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 5 వికెట్లు తీసి మేఘాలయ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. దీంతో 243 పరుగులకే మేఘాలయ కథ ముగిసింది.

ఈ క్రమంలో 198 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ జట్టు 5 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. ఓపెనర్‌ గహ్లోత్‌ రాహుల్‌ సింగ్‌(62), కెప్టెన్‌ తిలక్‌ వర్మ(64) అర్ధ శతకాలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఇదిలా ఉంటే.. తాజా సీజన్‌లో ప్లేట్‌ గ్రూప్‌లో ఉన్న హైదరాబాద్‌, మేఘాలయ ఇప్పటికే ఎలైట్‌ డివిజన్‌కు అర్హత సాధించాయి. వచ్చే ఎడిషన్‌లో ఎలైట్‌ గ్రూపులో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. అయితే, మంగళవారం ముగిసిన ఫైనల్లో మేఘాలయపై పైచేయి సాధించి ఆధిపత్యాన్ని చాటుకుంది హైదరాబాద్‌.  తద్వారా ప్లేట్‌ గ్రూపు చాంపియన్‌గా అవతరించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)