Breaking News

శతక్కొట్టిన పడిక్కల్‌, మనీశ్‌ పాండే.. కర్ణాటక భారీ స్కోర్‌

Published on Sun, 01/07/2024 - 14:55

రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో పరుగుల వరద పారుతుంది. దాదాపు ప్రతి మ్యాచ్‌లో బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక ఆటగాళ్లు సైతం రెచ్చిపోయారు. దేవ్‌దత్‌ పడిక్కల్‌, మనీశ్‌ పాండే శతకాల మోత మోగించారు. పడిక్కల్‌ 216 బంతుల్లో 24 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 193 పరుగుల భారీ శతకం బాదగా.. మనీశ్‌ పాండే సైతం మెరుపు శతకంతో (165 బంతుల్లో 118; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. వీరిద్దరికి తోడు శ్రీనివాస్‌ శరత్‌ (76) కూడా రాణించడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 514 పరుగులు (8 వికెట్ల నష్టానికి) చేసి, ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

కర్ణాటక ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ డకౌట్‌ కాగా.. ఓపెనర్‌ ఆర్‌ సమర్థ్‌ 38, నికిన్ జోస్‌ 8, శుభంగ్‌ హేగ్డే 27, విజయ్‌ కుమార్‌ వైశాఖ​్‌ 19, రోహిత్‌ కుమార్‌ 22 నాటౌట్‌, విధ్వత్‌ కవేరప్ప 4 నాటౌట్‌ పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. ప్రేరిత్‌ దత్‌, నమన్‌ ధిర్‌ తలో 2 వికెట్లు, సిదార్థ్‌ కౌల్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పంజాబ్‌ సైతం పరుగుల వరద పారిస్తుంది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (85), ప్రభసిమ్రన్‌ సింగ్‌ (83) శతకాల దిశగా సాగుతున్నారు. మూడో రోజు టీ విరామం సమయానికి పంజాబ్‌ స్కోర్‌ 169/0గా ఉంది. 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)