Breaking News

మెరుపు శతకంతో విరుచుకుపడిన శివమ్‌ దూబే

Published on Fri, 02/16/2024 - 18:37

రంజీ ట్రోఫీ 2024లో భాగంగా అసోంతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఆటగాడు శివమ్‌ దూబే మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 87 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన దూబే అసోం బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. ముంబై ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక స్కోర్‌ 31 పరుగులు (షమ్స్‌ ములానీ) కాగా.. దూబే ఒక్కడే వన్‌ మ్యాన్‌ షో నడిపించాడు. గత మ్యాచ్‌లో రెస్ట్‌ తీసుకున్న దూబే రీఎంట్రీలో అదగొట్టాడు.

ఈ ఇన్నింగ్స్‌లో 95 బంతులు ఎదుర్కొన్న దూబే 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనితో పాటు శార్దూల్‌ ఠాకూర్‌ (2) క్రీజ్‌లో ఉన్నాడు. ముంబై ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా 30, భుపేన్‌ లాల్వాని 0, హార్దిక్‌ తామోర్‌ 22, కెప్టెన్‌ అజింక్య రహానే 22, సుయాంశ్‌ షేడ్గే 0, షమ్స ములానీ 31 పరుగులు చేసి ఔటయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబై స్కోర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 217/6గా ఉంది. అసోం బౌలర్లలో దిబాకర్‌ జోహ్రి, రాహుల్‌ సింగ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. సునీల్‌ లచిత్‌, కునాల్‌ శర్మ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

ఇవాళే మొదలైన ఈ మ్యాచ్‌లో అసోం టాస్‌ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసింది. అసోం బ్యాటర్లను శార్దూల్‌ ఠాకూర్‌ ఉతికి ఆరేశాడు (6/21). శార్దూల్‌తో పాటు షమ్స్‌ ములానీ (2/8), తుషార్‌ దేశ్‌పాండే (1/32), మోహిత్‌ అవస్థి (1/10) కూడా చెలరేగడంతో అసోం ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది. ఆ జట్టు 84 పరుగులకే ఆలౌటైంది. అసో​ం ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ ఠాకూరీ (31), సాహిల్‌ జైన్‌ (12), అబ్దుల్‌ అజీజ్‌ ఖురేషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)