Breaking News

హనుమ విహారి, రికీ భుయ్‌ శతకాలు.. ఆంధ్ర ఘన విజయం

Published on Mon, 01/29/2024 - 15:19

Ranji Trophy 2023-24- Chhattisgarh vs Andhra: రంజీ ట్రోఫీ 2023-24లో ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర క్రికెట్‌ జట్టు ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని 126 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రాయ్‌పూర్‌ వేదికగా శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఛత్తీస్‌గఢ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 431 పరుగుల భారీ స్కోరు చేసింది.

టాపార్డర్‌ విఫలమైనా.. మిడిలార్డర్‌లో హనుమ విహారి(183), కెప్టెన్‌ రికీ భుయ్‌(120) సెంచరీలు చేయడంతో ఈ మేరకు పరుగులు సాధించింది. అనంతరం ఛత్తీస్‌గఢ్‌ 262 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్‌ ముగించగా.. ఆంధ్రకు 169 రన్స్‌ ఆధిక్యం దక్కింది.

ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఆంధ్ర జట్టు.. 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 150 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఛత్తీస్‌గఢ్‌కు 320 పరుగుల లక్ష్యం విధించింది. అయితే, ఆంధ్ర బౌలర్ల విజృంభణ కారణంగా ఛత్తీస్‌గఢ్‌ 193 పరుగులకే కుప్పకూలింది. దీంతో 126 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

కాగా సోమవారం ముగిసిన ఈ రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర బౌలర్లలో  ప్రశాంత్‌ కుమార్‌, నితీశ్‌ రెడ్డి మూడేసి వికెట్లు తీయగా.. పృథ్వీరాజ్‌ యర్రా రెండు, గిరినాథ్‌ రెడ్డి ఒక వికెట్‌ దక్కించుకున్నారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన హనుమ విహారికి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

చదవండి: Ind vs Eng: విశాఖ టెస్టు.. విద్యార్థులతో పాటు వాళ్లకూ ఫ్రీ ఎంట్రీ 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)