Breaking News

VIDAR Vs AP: నిరాశపరిచిన కేఎస్‌ భరత్‌.. ఆంధ్ర జట్టు ఓటమి

Published on Tue, 10/15/2024 - 09:20

నాగ్‌పూర్‌: రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్‌ టోర్నీ సీజన్‌ను ఆంధ్ర జట్టు ఓటమితో ఆరంభించింది. మాజీ చాంపియన్‌ విదర్భ జట్టుతో సోమవారం ముగిసిన గ్రూప్‌ ‘బి’ తొలి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 74 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

​కాగా 318 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 86.4 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 79/1తో చివరి రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర జట్టు ఒకదశలో ఒక వికెట్‌ నష్టానికి 177 పరుగులతో పటిష్టంగా కనిపించింది. అయితే ఓపెనర్‌ అభిషేక్‌ రెడ్డి (78; 5 ఫోర్లు, 1 సిక్స్‌), షేక్‌ రషీద్‌ (74; 7 ఫోర్లు) 12 పరుగుల వ్యవధిలో అవుటవ్వడంతో ఆంధ్ర జట్టు పతనం మొదలైంది.

శశికాంత్‌ కాస్త పోరాడినా
వీరిద్దరు పెవిలియన్‌ చేరుకున్నాక వచ్చిన ఇతర బ్యాటర్లెవరూ క్రీజులో కుదురుకోలేకపోయారు. కెప్టెన్‌ రికీ భుయ్‌ (26; 1 ఫోర్, 1 సిక్స్‌), శశికాంత్‌ (25; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కాస్త పోరాడినా...  కేఎస్‌ భరత్‌ (2), అశ్విన్‌ హెబర్‌ (3) నిరాశపరిచారు. విజయ్‌ (0), లలిత్‌ మోహన్‌ (0), సత్యనారాయణ రాజు (0) డకౌట్‌ అయ్యారు.

చివరి వికెట్‌గా శశికాంత్‌ వెనుదిరిగాడు. విదర్భ జట్టు బౌలర్లు ఆదిత్య థాకరే (4/47), హర్ష్‌ దూబే (4/69), అక్షయ్‌ వాఖరే (2/71) ఆంధ్ర జట్టు పతనాన్ని శాసించారు. ఈ గెలుపుతో విదర్భ జట్టుకు ఆరు పాయింట్లు లభించాయి. ఈనెల 18 నుంచి జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్‌ జట్టుతో ఆంధ్ర జట్టు ఆడుతుంది.

చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)