Breaking News

భరత్, విహారి పోరాడినా...

Published on Sun, 11/10/2024 - 08:40

సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీలో తొలి విజయం కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న ఆంధ్ర జట్టుకు నాలుగో మ్యాచ్‌లోనూ అది దక్కలేదు. ఊరించే లక్ష్య ఛేదనలో మిడిలార్డర్‌ రాణించినా... కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం దెబ్బ కొట్టింది. మొత్తానికి పరాజయాల హ్యాట్రిక్‌ అనంతరం తాజా సీజన్‌లో ఆంధ్ర జట్టు ఓటమినుంచి తప్పించుకుంటూ తొలి ‘డ్రా’ నమోదు చేసుకుంది. ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా విజయనగరం స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌ను ఆంధ్ర జట్టు ‘డ్రా’గా ముగించింది.

 321 పరుగుల విజయ లక్ష్యంతో ఓవర్‌నైట్‌ స్కోరు 8/1తో శనివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆంధ్ర జట్టు... చివరకు 93 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. వికెట్‌ కీపర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ (90 బంతుల్లో 92; 12 ఫోర్లు, ఒక సిక్సర్‌) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేయగా... హనుమ విహారి (189 బంతుల్లో 66; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌), కరణ్‌ షిండే (171 బంతుల్లో 65; 8 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించారు. ఓపెనర్లు అభిషేక్‌ రెడ్డి (6), మారంరెడ్డి హేమంత్‌ రెడ్డి (2) త్వరగానే ఔటవడంతో ఆంధ్ర జట్టుకు మరో ఓటమి తప్పదనిపించినా... కెపె్టన్‌ షేక్‌ రషీద్‌ (31; 4 ఫోర్లు) కాసేపు పోరాడాడు. 

అతడు వెనుదిరిగిన తర్వాత కరణ్‌ షిండే , హనుమవిహారి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. తొందరపాటుకు పోకుండా ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. విహారి అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్‌తో ఆలరించగా.. శ్రీకర్‌ భరత్‌ ఎడాపెడా బౌండ్రీలతో మైదానాన్ని హోరెత్తించాడు. అతడున్నంతసేపు ఆంధ్ర జట్టు విజయం సాధించడం ఖాయమే అనిపించింది. అయితే మరి కాసేపట్లో ఆట ముగుస్తుందనగా... అతడు పెవిలియన్‌ చేరడంతో ఆంధ్ర జట్టు ఆశలు ఆవిరయ్యాయి. ఉత్తరాఖండ్‌ బౌలర్లలో దీపక్‌ ధాపోలా 5 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఉత్తరాఖండ్‌ ఓపెనర్‌ ప్రియాన్షు ఖండూరికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.  

స్కోరు వివరాలు 
ఉత్తరాఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 338; ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌ 146; ఉత్తరాఖండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 128/9 డిక్లేర్డ్‌; ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌: అభిషేక్‌ రెడ్డి (బి) దీపక్‌ ధాపోలా 6; హేమంత్‌ రెడ్డి (ఎల్బీ) (బి) దీపక్‌ ధాపోలా 2; షేక్‌ రషీద్‌ (ఎల్బీ) (బి) దీపక్‌ ధాపోలా 31; కరణ్‌ షిండే (సి) అవనీశ్‌ సుధ (బి) దీపక్‌ ధాపోలా 65; హనుమ విహారి (బి) దీపక్‌ ధాపోలా 66; శ్రీకర్‌ భరత్‌ (సి) ఆదిత్య తారె (బి) దేవేంద్ర సింగ్‌ బోరా 92; శశికాంత్‌ (నాటౌట్‌) 7; విజయ్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు 16, మొత్తం (93 ఓవర్లలో 6 వికెట్లకు) 286. వికెట్ల పతనం: 1–8, 2–13, 3–56, 4–140, 5–276, 6–282, బౌలింగ్‌: దీపక్‌ ధాపోలా 21–3–75–5, మయాంక్‌ మిశ్రా 16–5–34–0; స్వప్నిల్‌ సింగ్‌ 19–3–52–0, అభయ్‌ నేగీ 17–4–57–0, దేవేంద్ర సింగ్‌ బోరా 14–2–46–1, అవనీశ్‌ సుధ 5–1–6–0, రవికుమార్‌ సమర్థ్‌ 1–0–1–0.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)