నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు
Breaking News
మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!
ప్రజలకు వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ
ఇస్రో: జీఎస్ఎల్వీ-ఎఫ్17 సక్సెస్.. నింగిలోకి ‘నిఘా నేత్రం’
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
ఒక్క పోటుతో.. చిన్నారెడ్డి ఫస్ట్ రియాక్షన్
సురేఖ బర్తరఫ్.. కొండా మురళి సంచలన ట్వీట్
ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన చాట్‌జీపీటీ, జెమిని ఏఐ
మోదీకి ఆ కానుక ఇవ్వాలనుకున్నా.. కానీ ఏమైందంటే?
శ్రీకాంత్ అద్భుత విజయం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర
హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు.. ఈ రూట్లలో వెళ్తున్నారా?
వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు
అగార్కర్ అందుకే రాలేదు.. రోహిత్ గురించి ఎందుకు?: బీసీసీఐ
‘బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సిందే’
రేవంత్‌రెడ్డిని శపిస్తున్నాను: కొండా సుస్మిత సంచలనం
తెలంగాణ సీఈఓ సుదర్శన్‌రెడ్డికి ‘సర్’ నోటీసులు
మీసం మెలేసిన కొండా మురళి
స్త్రీవాద దిగ్గజం, ప్రముఖ జర్నలిస్టు, రచయిత్రి కన్నుమూత
గతంలోనూ మంత్రులు బర్తరఫ్.. ఎవరెవరు? ఎప్పుడెప్పుడంటే?
శతకాల మోత మోగించిన టీమిండియా ఆటగాళ్లు
Published on Wed, 01/04/2023 - 21:36
Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా నిన్న (జనవరి 3) మొదలైన గ్రూప్ మ్యాచ్‌ల్లో ఇవాళ (రెండో రోజు) కొందరు అంతర్జాతీయ ఆటగాళ్లు సెంచరీలతో రెచ్చిపోయారు.
- త్రిపురతో జరుగుతున్న మ్యాచ్‌లో చండీఘర్ ఆటగాడు మనన్ వోహ్రా (200) ద్విశతకంతో విజృంభించగా, అదే జట్టు ఆటగాడు కునల్ మహాజన్ (162) అజేయమైన శతకంతో చెలరేగాడు.
- ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్‌లో నాగాలాండ్ ఆటగాడు చేతన్ బిస్త్ (129) సెంచరీతో రాణించాడు.
- ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ (165) శతకంతో అలరించాడు.
- మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్ ఆటగాడు అనుప్ అహ్లావత్ (123).. అంతకుముందు మేఘాలయ ఆటగాళ్లు కిషన్ (128), పునిత్ బిస్త్ (215), తారిఖ్ సిద్దిఖీ (102 నాటౌట్) శతకాల మోత మోగించారు.
- విదర్భతో జరుగుతన్న మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ (121) సెంచరీ సాధించాడు.
- జమ్మూ అండ్ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రైల్వేస్ ఆటగాడు మహ్మద్ సైఫ్ (233) ద్విశతకంతో రెచ్చిపోయాడు.
- గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాడు నెహాల్ వధేరా (123) సెంచరీ సాధించాడు.
- జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ ఆటగాడు కరణ్ లాంబా (122) అజేయ శతకంతో రాణించాడు.
- గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో కేరళ ఆటగాడు ఆర్ ప్రేమ్ (112) సెంచరీ సాధించాడు.
- బరోడా-హిమాచల్ ప్రదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బరోడా కెప్టెన్ విక్రమ్ సోలంకి (178), హిమాచల్ ఆటగాడు ప్రశాంత్ చోప్రా (111) శతకాలు సాధించారు.
- అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో మహారాష్ట్ర ఆటగాడు కేధార్ జాదవ్ (142 నాటౌట్) శతకొట్టాడు.
- ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఆటగాళ్లు హార్విక్ దేశాయ్ (107), అర్పిత్ వసవద (127 నాటౌట్) సెంచరీలు సాధించారు.
- తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ (162) శతకొట్టాడు.
- చత్తీస్‌ఘడ్-కర్ణాటక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత చత్తీస్‌ఘడ్ ఆటగాడు అశుతోష్ (135), ఆతర్వాత కర్ణాటక కెప్టెన్ మయాంక్ ఆగర్వాల్ (102 నాటౌట్) సెంచరీలతో రాణించారు.
- పుదుచ్ఛేరితో జరుగుతున్న మ్యాచ్‌లో సర్వీసెస్ ఆటగాళ్లు గెహ్లౌత్ రాహుల్ సింగ్ (137), రజత్ పలివాల్ (101) శతకాలతో రాణించారు.
#
Tags : 1