Breaking News

సౌతాఫ్రికా ఆటగాడి సునామీ ఇన్నింగ్స్‌.. కేవలం 9 బంతుల్లోనే! వీడియో

Published on Thu, 07/03/2025 - 12:02

మేజ‌ర్ లీగ్ క్రికెట్‌-2025లో టెక్సాస్ సూప‌ర్ కింగ్స్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. ఈ టోర్నీలో భాగంగా గురువారం వాషింగ్ట‌న్ ఫ్రీడ‌మ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 43 ప‌రుగుల తేడాతో సూప‌ర్ కింగ్స్ విజ‌య‌భేరి మ్రోగించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ 5 వికెట్ల నష్టానికి 87 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్లు స్టోయినిష్‌(2), డార్లీ మిచెల్‌(6 రిటైర్డ్‌ హార్ట్‌) నిరాశపరిచినప్పటికి.. శుభమ్ రంజనే( 14 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 నాటౌట్‌), డోనోవన్ ఫెరీరా(9 బంతుల్లో 5 సిక్స్‌లతో 37 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.

సౌతాఫ్రికాకు చెందిన ఫెరీరా.. ఆఖరి ఓవర్‌ వేసిన మిచెల్‌ ఓవెన్‌ బౌలింగ్‌లో నాలుగు సిక్సర్లు, రెండు డబుల్స్‌ సాయంతో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. అతడి విధ్వంసకర బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. కాగా వాషింగ్టన్‌ బౌలర్లలో నేట్రావల్కర్ ఓ వికెట్‌ సాధించాడు. 

అనంతరం 88 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిదిగిన వాషింగ్టన్‌ జట్టు నిర్ణీత 5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 44 పరుగులకే పరిమితమైంది. వాషింగ్టన్‌ బ్యాటర్లలో గ్లెన్‌ ఫిలిప్స్‌(18) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్‌ మాక్స్‌వెల్‌ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. సూపర్‌ కింగ్స్‌ బౌలర్లలో బర్గర్‌ రెండు, అకిల్‌ హోసేన్‌, నూర్‌ ఆహ్మద్‌ తలా వికెట్‌ సాధించారు. కాగా టెక్సాస్‌, వాషింగ్టన్ రెండు జట్లు ఇప్పటికే తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకున్నాయి.



 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)