Breaking News

భార‌త బాక్సింగ్ చ‌రిత్ర‌లో ఇదొక మైలు రాయి: రానా

Published on Wed, 08/14/2024 - 11:50

భార‌త్‌లో బాక్సింగ్‌కు ఆద‌ర‌ణ పెంచే దిశ‌గా బాక్సింగ్‌బే, స్పిరిట్ మీడియా ఫౌండ‌ర్ రానా దగ్గుబాటి అడుగులు వేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే రెండు బాక్సింగ్‌ ఈవెంట్‌లను నిర్వహించేందుకు 'ఆంథోనీ పెట్టిస్ ఫైట్ క్లబ్' వ్యవస్థాపకుడు ఆంథోనీ పెట్టిస్‌తో రాణా ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఈ ఏడాది డిసెంబర్ తర్వాత ఈ రెండు ఈవెంట్లు జరగనున్నాయి. ఒకటి భారత్‌లో, మరొకటి యునైటెడ్ స్టేట్స్‌లో నిర్వహించాలని రానా, ఆంథోని పెట్టిస్ నిర్ణయించుకున్నారు. కాగా ఈ రెండు ఈవెంట్లు 5 వ‌ర్సెస్ 5గా జ‌ర‌గ‌నున్నాయి. 

ఇక ఈ ఒప్పందం మెక్సికోలో ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్ (WBC) ప్రతినిథులు ఆస్కార్ వల్లే, ఎరికా కాంట్రేరాస్ ఆధ్వర్యంలో బుధ‌వారం జ‌రిగింది. కాగా ప్రపంచవ్యాప్తంగా బాక్సింగ్ క్లబ్‌లను ప్రమోట్ చేసేందుకు వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్‌ను 1963లో స్ధాపించారు. 

ఈ సంద‌ర్భంగా రానా మాట్లాడుతూ.. "ఆంథోనీ పెట్టిస్ ఫైట్ క్లబ్‌తో ఒప్పందం భార‌త బాక్సింగ్ చ‌రిత్ర‌లో ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది. భారత టర్ఫ్‌లో స్టార్ యూఎస్ అథ్లెట్లకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా.. మ‌న బాక్స‌ర్‌ల‌కు అంత‌ర్జాతీయ స్ధాయిలో అవ‌కాశాలు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. 

నిజంగా గ్రేట్ బాక్సింగ్ క్ల‌బ్‌తో భాగ‌స్వామిగా చేరడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఒప్పందం భార‌త్‌, యూఎస్ బాక్స‌ర్ల‌కు మంచి అవ‌కాశాలు క‌ల్పిస్తోంద‌న్న న‌మ్మ‌కం మాకు ఉంది. అదేవిధంగా భార‌త్‌లో బాక్సింగ్‌కు ఆద‌ర‌ణ పెంచేందుకు బాక్సింగ్ బే క్ల‌బ్ అన్ని విధాల కృషి చేస్తుంది.

భారత బాక్సింగ్‌ను ప్రపంచానికి పరిచయం చేసేందుకే ఏపీఎఫ్‌సీతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని" పేర్కొన్నాడు. అయితే అగ్రశ్రేణి అమెరికన్ బాక్సర్లు భారత్‌లో జరిగే ఈవెంట్‌లో పాల్గోనుండడం ఇదే తొలిసారి. కాగా ఆంథోనీ పెట్టిస్.. ఒక మాజీ యూఎఫ్‌సీ లైట్ వెయిట్ ఛాంపియన్.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)