Breaking News

చరిత్ర సృష‍్టించిన రమేశ్‌

Published on Sun, 08/10/2025 - 04:12

చెన్నై: అలలపై తేలియాడే సర్ఫింగ్‌లో రమేశ్‌ బుధియాల్‌ చరిత్ర సృష్టించాడు. ఆసియా సర్ఫింగ్‌ చాంపియన్‌షిప్‌ ఓపెన్‌ మెన్స్‌ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారత సర్ఫర్‌గా రమేశ్‌ రికార్డుల్లోకెక్కాడు. శనివారం సెమీఫైనల్లో రమేశ్‌ 11.43 పాయింట్లు సాధించి రెండో స్థానంతో తుదిపోరుకు అర్హత సాధించాడు. ఇండోనేసియాకు చెందిన పజర్‌ అరియానా 13.83 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచాడు. 

అంతకుముందు క్వార్టర్‌ ఫైనల్లో రమేశ్‌ 14.84 పాయింట్లతో ఫిలిప్పిన్స్‌ సర్ఫర్‌ నీల్‌ సాంచెస్‌ (12.80 పాయింట్లు) వెనక్కి నెట్టి ముందంజ వేశాడు. భారత్‌కు చెందిన కిషోర్‌ కుమార్‌ కూడా సెమీఫైనల్‌కు చేరగా... అతడు 8.03 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. 

మరో భారత సర్ఫర్‌ శ్రీకాంత్‌ క్వార్టర్స్‌లో పోరాడి ఓడాడు. అండర్‌–18 ఈవెంట్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. ఈ విభాగంలో హరీశ్, ఆద్య సింగ్, దమయంతి శ్రీరామ్‌ క్వార్టర్స్‌లో పరాజయం పాలై ఇంటిబాట పట్టారు. 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)