Breaking News

ఎస్‌ఆర్‌హెచ్‌ ఓనర్‌ కావ్యా బాధను చూడలేకపోతున్నా: రజనీకాంత్‌

Published on Sat, 07/29/2023 - 13:19

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో సన్‌రైజర్స్‌ హైదారబాద్‌ గత కొన్ని సీజన్లగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ సీజన్‌కు ఆటగాళ్లతో పాటు కోచ్‌లు మారుతున్నప్పటికీ.. ఎస్‌ఆర్‌ఆహెచ్‌ ఆటతీరు మాత్రం మారడం లేదు. కనీసం ఈ ఏడాది సీజన్‌లోనైనా అదరగొడుతుందని భావించిన అభిమానులను ఎస్‌ఆర్‌హెచ్‌ మరోసారి నిరాశ పరిచింది. ఐపీఎల్‌-2023లో 14 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగే విజయాలతో ఆఖరి స్థానంతో  ముగించింది.

ఇక తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రదర్శనపై సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక వాఖ్యలు చేశారు. సన్‌రైజర్స్‌ యాజమాని కావ్యా మారన్‌ పడే బాధను తన చూడలేక పోతున్నాని రజనీ అన్నారు. తన రాబోయే చిత్రం ‘జైలర్’ ఆడియో ఆవిష్కరణ సందర్భంగా ఆయన ఈ వాఖ్యలు చేశారు. జైలర్‌ ఆడియో లంచ్‌లో తలైవా మాట్లాడుతూ..  "ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌ ఓడిపోయినప్పుడు స్టేడియంలో కావ్యా నిరాశగా ఉండటం చూడలేకపోతున్నా. చాలా సందర్భాల్లో టీవీ ఛానల్‌ను కూడా మార్చేశా. కాబట్టి కళానిధి మారన్‌(కావ్య మారన్ తండ్రి)కు నేను ఒక్క సలహా ఇవ్వాలనుకుంటున్నాను.

జట్టులో మంచి ప్లేయర్స్‌కు అవకాశం ఇవ్వాలి. వేలంలో మెరగైన ఆటగాళ్లను సొంతం చేసుకోవాలి. జట్టున మరింత బలపేతం చేయాలని" సూచించారు. కాగా కళానిధి మారన్‌ రజినీ జైలర్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఐపీఎల్‌-2024కు ముందు మరోసారి తమ  జట్టును ప్రక్షాళన చేయాలని ఎస్‌ఆర్‌హెచ్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే హెడ్‌కోచ్‌ బ్రియాన్ లారాను ఉద్వసన పలకనున్నట్లు తెలుస్తోంది.  అదే విధంగా ఇంగ్లండ్‌ ఆటగాడు హ్యారీ బ్రూక్(రూ. 13.25 కోట్లు)ను వదులుకోవాలని ఎస్‌ఆర్‌హెచ్‌ మెనెజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
చదవండి: IND vs WI: అస్సలు నేను ఊహించలేదు.. అతడు ఓపెనర్‌గా వస్తాడని! కచ్చితంగా జట్టులో ఉండాలి

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)