Breaking News

భారత క్రికెట్‌లో అనూహ్య పరిణామం.. బీసీసీఐ అధ్యక్షుడి రాజీనామా

Published on Fri, 08/29/2025 - 14:44

భారత క్రికెట్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) అధ్యక్ష పదవికి రోజర్‌ బిన్నీ రాజీనామా చేశారు. బిన్నీ స్థానంలో ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా జరిగిన బీసీసీఐ ఏపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మార్పు చోటు చేసుకుంది.

రోజర్‌ బిన్నీ రాజీనామా వెనుక కారణాలేమీ లేవు. బీసీసీఐ నిబంధనల ప్రకారం 70 ఏళ్లు దాటిన వ్యక్తి అధ్యక్ష పదవిలో కొనసాగడం సాధ్యపడదు. బిన్నీ ఇటీవలే 70వ పడిలోకి అడుగుపెట్టారు. అందుకే అతను స్వచ్ఛందంగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం అధికారికంగా ప్రకటించబడింది.

కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు రాజీవ్‌ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడి హోదాలో కొనసాగుతారు. అధ్యక్ష ఎన్నికలు సెప్టెంబర్‌లో జరిగే అవకాశం ఉంది. కొత్త అధ్యక్షుడి రేసులో రాజీవ్‌ శుక్లాతో పాటు పలువురు భారత మాజీ క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు ఉన్నారని తెలుస్తుంది.

తాత్కాలిక అధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా క్రికెట్ పరిపాలనలో  చాలా అనుభవం ఉన్న వ్యక్తి. 2015లో అతడు ఐపీఎల్‌ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2020లో తొలి దఫా బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా.. మధ్యలో ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌ కార్యదర్శిగా వ్యవహరించారు. రాజీవ్‌ శుక్లాకు రాజకీయ ప్రవేశం కూడా ఉంది. జర్నలిజం రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన శుక్లా.. ప్రస్తుతం ఛత్తీస్‌ఘడ్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)