Breaking News

RCB Vs PBKS: అన్న నీవు మార‌వా? ఇంకా ఎన్ని ఛాన్స్‌లు! జట్టు నుంచి తీసిపడేయండి

Published on Mon, 03/25/2024 - 23:31

టీమిండియా మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్‌. ఆర్సీబీ ఆట‌గాడు ర‌జిత్ పాటిదార్ త‌న పేల‌వ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఐపీఎల్‌-2024 తొలి మ్యాచ్‌లో విఫలమైన పాటిదార్‌.. ఇప్పుడు పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదే తీరును కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 18 బంతులు ఎదుర్కొన్న పాటిదార్‌ కేవలం 18 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన పాటిదార్‌ తన ఆట తీరుతో నిరాశరిచాడు. 

పంజాబ్‌ కింగ్స్‌ స్పిన్నర్‌ హార్‌ప్రీత్‌ బరార్‌ బౌలింగ్‌లో చెత్త షాట్‌ ఆడి పాటిదార్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అన్న నీవు మారవా ఇంకా ఎన్ని మ్యాచ్‌లు ఇలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది ఆర్సీబీ మెనెజ్‌మెంట్‌ను తప్పుబడుతున్నారు.

ఫామ్‌లో లేని ఆటగాడికి ఎందుకు ఛాన్స్‌లు ఇస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. అంతకుముందు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ పాటిదార్‌ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

177 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఆర్సీబీ బ్యాటర్లో విరాట్ కోహ్లి(49 బంతుల్లో 77, 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఆఖరిలో దినేష్ కార్తీక్ మెరుపు మెరిపించి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందిచాడు. కేవలం 10 బంతులు ఎదుర్కొన్న కార్తీక్.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)