Breaking News

అతడు లేకపోవడమే ఆర్సీబీకీ ఈ పరిస్ధితి.. ఉండింటేనా

Published on Fri, 05/26/2023 - 18:38

ఐపీఎల్‌-2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ గ్రూపు దశలోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్‌ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో ఆర్సీబీ సరిపెట్టుకుంది. అయితే ఈ సీజన్‌ ఆర్సీబీ బ్యాటింగ్‌లో ఫాప్‌ డుప్లెసిస్‌, విరాట్‌ కోహ్లి, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ మినహా మిగితా బ్యాటరంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో జట్టు బ్యాటింగ్‌ బాధ్యతను వీరిముగ్గురూ తమ భుజాలపై వేసుకున్నారు.

ఇక ఈ ఏడాది సీజన్‌లో ఆర్సీబీ మిడిలార్డర్‌  వైఫల్యంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ కీలక వాఖ్యలు చేశాడు. మిడిలార్డర్‌ బ్యాటర్‌ రజత్ పాటిదార్ లేకపోవడమే బెంగళూరుకు ఈ పరిస్థితి ఏర్పడందని మూడీ తెలిపాడు. కాగా ఈ ఐపీఎల్‌ 16వ సీజన్‌కు గాయం కారణంగా రజిత్‌ పాటిదార్‌ దూరమయ్యాడు. 

"ఆర్సీబీలో పటిదార్‌ లేని లోటు సృష్టంగా కన్పించింది. అతడు మూడో స్థానంలో అద్భుతమైన ఆటగాడు. అతడు జట్టులో లేకపోవడం విరాట్‌ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్, మాక్స్‌వెల్‌లపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చింది. కానీ ఈ ముగ్గురు అంత ఒత్తిడిలో కూడా అద్భుతంగా ఆడారు. అదే విధంగా మిడిలార్డర్‌లో మాత్రమే కాకుండా ఫినిషింగ్‌లో కూడా సరైన ఆటగాళ్లు కన్పించలేదు.

గత సీజన్‌లో ఫినిషర్‌గా అదరగొట్టిన దినేష్‌ కార్తీక్‌.. ఈ ఏడాది మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. ఛాంపియన్స్‌గా నిలవాలంటే ఒకరిద్దరు ఆడితే సరిపోదు. ఏ జట్టు అయితే సమిష్టిగా రాణిస్తుందో అందే విజేతగా నిలుస్తుంది. ఈ సీజన్‌ ఆర్సీబీకి ఒక గుణపాఠం అవుతుంది. వచ్చే సీజన్‌లో ఆర్సీబీ కచ్చితంగా తమ జట్టులో కొన్ని మార్పులు చేయాలని" ఈఎస్పీఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మూడీ పేర్కొన్నాడు

Videos

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో బిగ్ అప్‌డేట్

జోహార్ చంద్రబాబు.. జోహార్ లోకేష్.. గంటా కొడుకు అత్యుత్సాహం

బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం

పసి మనసులను చంపేస్తోన్న వివాహేతర సంబంధాలు

ఎల్లో మీడియా వేషాలు

Photos

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)