Breaking News

#RCBvsKKR: చెత్త బ్యాటింగ్‌.. ఇంకా ఎన్ని ఛాన్స్‌లు?

Published on Sat, 03/30/2024 - 07:00

ఐపీఎల్‌-2024లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఆట‌గాడు ర‌జిత్ పాటిదార్ ఆట ఏ మాత్రం మార‌లేదు.  ఈ మెగా ఈవెంట్‌లో వ‌రుస‌గా మూడో మ్యాచ్‌లోనూ పాటిదార్ నిరాశ‌పరిచాడు. చిన్నస్వామి స్టేడియం వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కేవ‌లం 3 ప‌రుగులు మాత్రమే చేసి  ఔట‌య్యాడు. కీల‌క స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన పాటిదార్‌.. ర‌స్సెల్ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరాడు.

ఈ సీజ‌న్‌లో ఇప్పటివ‌ర‌కు 3 మ్యాచ్‌లు ఆడిన అత‌డు కేవ‌లం 21 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఈ క్ర‌మంలో అత‌డిని ఆర్సీబీ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. ‘‘ఇకనైనా నీ ఆట తీరు మారదా’’ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మ‌రికొంత‌మంది అయితే ఆర్సీబీ మెనెజ్‌మెంట్ తీరును త‌ప్పుబ‌డుతున్నారు.

అత‌డు వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతున్న‌ప్ప‌టికి అవ‌కాశాలు ఎలా ఇస్తున్నార‌ని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. కాగా రాబోయే మ్యాచ్‌ల్లో పాటిదార్‌పై ఆర్సీబీ వేటు వేసే ఛాన్స్ ఉంది. అత‌డి స్ధానంలో మ‌హిపాల్ లామ్రోర్‌ను జ‌ట్టులోకి తీసుకునే అవ‌కాశ‌ముంది.

కాగా ఐపీఎల్‌కు ముందు ఇంగ్లండ్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లోనూ పాటిదార్ దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు. ఇప్పుడు అదే పేల‌వ ఫామ్‌ను పాటిదార్‌ కంటిన్యూ చేస్తున్నాడు. ఇక మ్యాచ్‌లో ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘ‌న విజ‌యం సాధించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)