Breaking News

‘ఫైవ్స్‌ వరల్డ్‌ కప్‌’లో భారత మహిళల జట్టు కెప్టెన్‌గా రజని 

Published on Mon, 01/01/2024 - 04:18

అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ‘హాకీ ఫైవ్స్‌’ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత మహిళల జట్టుకు  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యతిమరపు రజని కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఎఫ్‌ఐహెచ్‌ అధికారికంగా నిర్వహించే ఈ టోర్నీ ఒమన్‌లోని మస్కట్‌లో జనవరి 24నుంచి 27 వరకు జరుగుతుంది. గోల్‌కీపర్‌ రజని భారత్‌కు 96 మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించింది.

భారత జట్టుకు మహిమా చౌదరి వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక కాగా...బన్సారి సోలంకి, అక్షతా అబాసో ఢేకలే, జ్యోతి ఛత్రి, మరియానా కుజుర్, ముంతాజ్‌ ఖాన్, అజ్మినా కుజుర్, రుతుజ దాదాసొ పిసాల్, దీపిక సోరెంగ్‌ ఇతర జట్టు సభ్యులు. టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. పూల్‌ ‘సి’లో భారత్‌తో పాటు నమీబియా, పోలండ్, అమెరికా ఉన్నాయి.

ఫిజి, మలేసియా, నెదర్లాండ్స్, ఒమన్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్, జాంబియా, న్యూజిలాండ్, పరాగ్వే, థాయిలాండ్, ఉరుగ్వే కూడా పాల్గొంటున్నాయి. ఆ తర్వాత జనవరి 28నుంచి 31 వరకు జరిగే పురుషుల ‘హాకీ ఫైవ్స్‌’ ప్రపంచకప్‌లో భారత సారథిగా సిమ్రన్‌జిత్‌ సింగ్‌ ఎంపికయ్యాడు.   సూరజ్‌ కర్కేరా, ప్రశాంత్‌ కుమార్, మన్‌దీప్‌ మోర్, మంజీత్, రాహీల్, మణీందర్, పవన్‌ రాజ్‌భర్, గుర్జోత్‌ సింగ్, ఉత్తమ్‌ సింగ్‌  జట్టులో ఇతర సభ్యులు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)