Breaking News

IPL 2024: టెస్టు మ్యాచ్‌లా ఆడాడు.. ఎస్ఆర్‌హెచ్ కొంప‌ముంచాడు! ఎవ‌రంటే?

Published on Sun, 03/24/2024 - 07:10

ఐపీఎల్‌-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ను త‌లిపించింది. ఆఖ‌రి వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 4 ప‌రుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఓట‌మి పాలైంది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్‌  హెన్రిస్ క్లాసెన్ 63 ప‌రుగుల‌తో విరోచిత పోరాటం చేసిన‌ప్ప‌టికి త‌న జ‌ట్టును గెలిపించలేక‌పోయాడు. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు మాత్ర‌మే చేసింది.

అయితే ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఆట‌గాడు రాహుల్ త్రిపాఠి దారుణమైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. త్రిపాఠి త‌న ఆట తీరుతో ప‌రోక్షంగా ఎస్ఆర్‌హెచ్ ఓట‌మికి కార‌ణ‌మ‌య్యాడు. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెన‌ర్లు మయాంక్ అగర్వాల్‌, అభిషేక్ శర్మ మంచి అరంభాన్ని ఇచ్చారు.  తొలి వికెట్‌కు 60 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు.

అగ‌ర్వాల్ ఔట‌య్యాక క్రీజులోకి రాహుల్ త్రిపాఠి వ‌చ్చాడు. క్రీజులోకి వ‌చ్చిన‌ప్ప‌టినుంచే ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఎదుర్కోవ‌డానికి రాహుల్ క‌ష్ట‌ప‌డ్డాడు. ఓ వైపు కావాల్సిన ర‌న్‌రేట్(రిక్వైడ్ ర‌న్ రేట్‌) పెరుగుతూ ఉంటే త్రిపాఠి డిఫెన్స్ ఆడుతూ విసుగు తెప్పించాడు. టెస్టు కంటే దారుణంగా త్రిపాఠి ఇన్నింగ్స్ కొన‌సాగింది.

అత‌డు రెండు సార్లు ఔట‌య్యే ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున‌ప్ప‌టికి త‌న ఇన్నింగ్స్‌ను మాత్రం ఎక్కువ స‌మ‌యం కొన‌సాగించ‌లేకపోయాడు. స‌రిగ్గా 20 బంతుల్లో 1 సిక్స‌ర్‌తో 20 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఈ క్ర‌మంలో అత‌డిపై ఎస్ఆర్‌హెచ్ అభిమానులు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. టెస్టు మ్యాచ్‌లా ఆడి ఎస్ఆర్‌హెచ్ కొంప‌ముంచాడ‌ని పోస్ట్‌లు పెడుతున్నారు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)