అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
భారీ సిక్సర్ బాదిన ద్రవిడ్ కొడుకు.. వీడియో వైరల్
Published on Sat, 08/17/2024 - 14:17
మహారాజా ట్రోఫీ-2024లో భారత మాజీ హెడ్‌కోచ్ తనయుడు సమిత్ మరోసారి నిరాశపరిచాడు. ఈ లీగ్‌లో మైసూరు వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సమిత్.. శుక్రవారం బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
అయితే ఈ మ్యాచ్‌లో మాత్రం సుమిత్ అద్బుతమైన సిక్స్‌తో మెరిశాడు. అతడు కొట్టిన షాట్‌కు అందరూ ఫిదా అయిపోయారు. మైసూర్ ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన జ్ఞానేశ్వర్ నవీన్.. నాలుగో బంతిని సమిత్‌కు ఔట్‌సైడ్ హాఫ్ స్టంప్ దిశగా షార్ట్ పిచ్ డెలివరీగా సంధించాడు.
ఈ క్రమంలో సమిత్ మిడాన్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతికే సమిత్ ఔటయ్యాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా టోర్నీలో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన సమిత్ కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మైసూరు వారియర్స్‌పై బెంగళూరు బ్లాస్టర్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మహారాజా ట్రోఫీ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతోంది.
ದ್ರಾವಿಡ್ ಸರ್ ಮಗ ಗುರು ಇವ್ರು..🤯🔥
ಈ ಸಿಕ್ಸ್ ಗೆ ಒಂದು ಚಪ್ಪಾಳೆ ಬರ್ಲೇಬೇಕು..👏👌
📺 ನೋಡಿರಿ Maharaja Trophy KSCA T20 | ಬೆಂಗಳೂರು vs ಮೈಸೂರು | LIVE NOW #StarSportsKannada ದಲ್ಲಿ#MaharajaTrophyOnStar@maharaja_t20 pic.twitter.com/ROsXMQhtwO— Star Sports Kannada (@StarSportsKan) August 16, 2024
Tags : 1