Breaking News

రాహుల్‌ ద్రవిడ్‌ తనయుడి వీర విహారం.. వీడియో వైరల్‌

Published on Thu, 07/02/2026 - 17:15

మహారాజా ట్రోఫీ కెఎస్‌సీఏ టీ20 టోర్నీలో భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ త‌న అద్భుత బ్యాటింగ్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు. ఈ టోర్నీలో 'కళ్యాణి బెంగళూరు బ్లాస్టర్స్' జట్టుకు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న స‌మిత్‌.. బుధ‌వారం హుబ్లీ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 

20 ఏళ్ల సమిత్  బ్యాక్-ఫుట్ కట్స్, లాఫ్టెడ్ డ్రైవ్స్, అద్భుతమైన పుల్ షాట్లతో త‌న తండ్రిని త‌ల‌పించాడు. కేవ‌లం 23 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 32 పరుగులు సాధించాడు. అత‌డి బ్యాటింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు బ్లాస్టర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ రోహన్ పాటిల్ (38 బంతుల్లో 64) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా..  ప్రవీణ్ దూబే (28 బంతుల్లో 51), స‌మిత్‌(32),  శివరాజ్ (7 బంతుల్లోనే 23 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. హుబ్లీ బౌలర్లలో వైభవ్ శర్మ 3, అభిషేక్ అహ్లావత్ 2 వికెట్లు పడగొట్టారు.

204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హుబ్లీ టైగర్స్ చివరి బంతి వరకు  పోరాడింది. మన్వంత్ కుమార్ కేవలం 22 బంతుల్లోనే 60 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. శివకుమార్ రక్షిత్ (41), అనీశ్వర్ గౌతమ్ (34), అభినవ్ మనోహర్ (21) కీలక సహకారం అందించారు. 

ఆఖరి బంతికి హుబ్లీ గెలుపునకు 5 పరుగులు అవసరం కాగా.. బెంగ‌ళూరు పేస‌ర్ నిశ్చిత్ రావు కేవ‌లం 2 ర‌న్స్ మాత్ర‌మే ఇచ్చాడు. బెంగళూరు బౌలర్లలో నిశ్చిత్ రావు మూడు, విద్వత్ కావేరప్ప రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.


 

 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)