IPL 2024: గంభీర్‌ గుడ్‌బై.. లక్నో మెంటార్‌గా రాహుల్‌ ద్రవిడ్‌?

Published on Sat, 11/25/2023 - 14:25

టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ కొనసాగుతాడా లేదా అన్న అంశంపై ఇంకా సస్పెన్స్‌ వీడలేదు. వన్డే వరల్డ్‌కప్‌-2023 ముగిసిన తర్వాత అతడి భవితవ్యంపై ఓ స్పష్టత వస్తుందనుకుంటే బీసీసీఐ నుంచి ఇందుకు సంబంధించి ఎటువంటి ప్రకటనా రాలేదు.

కాగా టీ20 వరల్డ్‌కప్‌-2021 తర్వాత రవిశాస్త్రి టీమిండియా హెడ్‌కోచ్‌గా వైదొలగగా.. ‘ది వాల్‌’ రాహుల్‌ ద్రవిడ్‌ ఆ బాధ్యతలు చేపట్టాడు. నాటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా ద్రవిడ్‌ను ఒప్పించి మరీ ఈ పదవిని కట్టబెట్టారు.

ఈ క్రమంలో రాహుల్‌ మార్గదర్శనం, రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ద్వైపాక్షిక సిరీస్‌లలో అద్భుత విజయాలు సాధించిన టీమిండియా ఐసీసీ టోర్నీల్లో మాత్రం చేతులెత్తేసింది. టీ20 వరల్డ్‌కప్‌-2022లో సెమీస్‌లోనే నిష్క్రమించిన భారత జట్టు.. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆఖరి మెట్టుపై బోల్తా పడింది.

ఇక ఈ ఐసీసీ ఈవెంట్‌ తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం అధికారికంగా ముగింపు దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో ద్రవిడ్‌ హెడ్‌కోచ్‌ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, బీసీసీఐ మాత్రం అతడి సేవలను మరోమారు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అతడు గనుక సుముఖంగా లేకపోతే వీవీఎస్‌ లక్ష్మణ్‌ హెడ్‌కోచ్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది.

ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. రాహుల్‌ ద్రవిడ్‌ను తమ మెంటార్‌గా నియమించుకునేందుకు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. దైనిక్‌ జాగరణ్‌ కథనం ప్రకారం.. మెంటార్‌గా గౌతం గంభీర్‌ స్థానంలో ద్రవిడ్‌ అయితే బాగుంటుందని ఎల్‌ఎస్‌జీ యాజమాన్యం ఆలోచిస్తోందట.

కాగా లక్నో మెంటార్‌గా సేవలు అందించిన మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ తిరిగి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గూటికి చేరుకున్నాడు. ఇక ఐపీఎల్‌-2024 వేలానికి ముందు ఆవేశ్‌ ఖాన్‌ వదులుకున్న లక్నో ఫ్రాంఛైజీ రాజస్తాన్‌ రాయల్స్‌తో డైరెక్ట్‌ స్వాప్‌ ద్వారా దేవ్‌దత్‌ పడిక్కల్‌ను దక్కించుకుంది. కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ హెడ్‌కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ను నియమించుకుంది.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)