Breaking News

కొంచెం ఆలోచించండి.. కోచ్‌గా ద్రవిడ్‌ జీరో: పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌

Published on Sat, 06/10/2023 - 10:28

టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌పై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ బాసిత్ అలీ విమర్శల వర్షం కురిపించాడు. ఈ కీలక మ్యాచ్‌లో ద్రవిడ్‌ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడని అలీ విరుచుకుపడ్డాడు. అదే విధంగా ద్రవిడ్‌ అద్భుతమైన ఆటగాడు అయినప్పటికీ కోచ్‌గా మాత్రం జీరో అని అలీ అన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు ప్రదర్శన చూసి అలీ ఈ వాఖ్యలు చేశాడు.  "టీమిండియా ఎప్పుడైతే తొలుత బౌలింగ్‌ ఎంచుకుందో అప్పుడే ఈ మ్యాచ్‌ను కోల్పోయింది.

ఇక భారత్‌ బౌలింగ్ కూడా ఐపీఎల్లోలాగే ఉంది. తొలి రోజు లంచ్‌ సమయానికి..  భారత బౌలర్లు ఏకంగా మ్యాచ్ గెలిచినట్లు చాలా సంతోషంగా కనిపించారు. ఇప్పుడు భారత జట్టు ముందు ఒక్కటే మార్గం. ఆసీస్‌ను వీలైనంత తొందరగా ఔట్‌ చేసి, భారత్‌ బ్యాటింగ్‌కు వచ్చి అద్బుతాలు సృష్టించాలి. అదే విధంగా ఫీల్డింగ్‌లో కూడా భారత ఆటగాళ్లు అంత ఫిట్‌నెస్‌గా కనిపించలేదు. రహానే, కోహ్లి, జడేజా మినహా చాలా మంది ప్లేయర్లు బాగా అలసిపోయినట్లు కనిపించారు" అని అలీ తన యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు.

ఇక ద్రవిడ్‌ గురించి మాట్లాడుతూ.. "నేను రాహల్‌ ద్రవిడ్‌కు వీరాభిమానిని. గతంలో ఇదే విషయం చాలా సార్లు చెప్పాను. అతడొక క్లాస్‌ ప్లేయర్‌, లెజెండ్‌. కానీ కోచ్‌గా మాత్రం అతడు జీరో. భారత్‌లో టర్నింగ్ పిచ్ లు తయారు చేయించారు.  నాకు ఒక్కదానికి సమాధానం చెప్పండి.  మీరు ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు అక్కడ అలాంటి పిచ్ లే ఉన్నాయా? అక్కడ బౌన్సీ పిచ్ లు ఉన్నాయా? ద్రవిడ్‌ ఏమీ ఆలోచిస్తున్నాడో ఆ దేవుడుకే తెలియాలంటూ ఘూటు వాఖ్యలు చేశాడు.
చదవండి: WTC Final: ఆసీస్‌ పేసర్‌ సూపర్‌ డెలివరీ.. భరత్‌కు దిమ్మతిరిగిపోయింది! వీడియో వైరల్‌

Videos

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)