చరిత్ర సృష్టించిన అఫ్గాన్‌ ఓపెనర్‌.. సచిన్‌, కోహ్లి రికార్డులు బద్దలు

Published on Tue, 11/12/2024 - 09:56

షార్జా వేదిక‌గా జ‌రిగిన ఆఖ‌రి వ‌న్డేలో 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. త‌ద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో అఫ్గానిస్తాన్ సొంతం చేసుకుంది. అఫ్గాన్ విజ‌యంలో స్టార్ ఓపెన‌ర్  రహ్మానుల్లా గుర్బాజ్ కీల‌క పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ అద్బుత‌మైన సెంచ‌రీతో మెరిశాడు. 245 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో గుర్బాజ్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 120 బంతులు ఎదుర్కొన్న గుర్భాజ్ 5 ఫోర్లు, 7 సిక్స్‌ల‌తో 101 ప‌రుగులు చేశాడు. కాగా రహ్మానుల్లాకు ఇది ఎనిమిదో వ‌న్డే అంత‌ర్జాతీయ సెంచ‌రీ కావ‌డం విశేషం. త‌ద్వారా గుర్భాజ్ ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.

సచిన్, కోహ్లి రికార్డు బ‌ద్దలు..
అంత‌ర్జాతీయ వ‌న్డేల్లో అతి పిన్న వ‌య‌స్సులోనే ఎనిమిది సెంచరీలు చేసిన రెండో ప్లేయ‌ర్‌గా గుర్భాజ్ రికార్డులెక్కాడు. గుర్భాజ్ కేవ‌లం 22 సంవత్సరాల, 349 రోజుల వ‌య‌స్సులో ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

ఈ క్ర‌మంలో భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌, ర‌న్ మిష‌న్ విరాట్ కోహ్లిని గుర్భాజ్ ఆధిగ‌మించాడు. సచిన్ 22 ఏళ్ల 357 రోజుల వ‌య‌స్సులో ఈ రికార్డు సాధించ‌గా.. కోహ్లి 23 ఏళ్ల 27 రోజుల వ‌య‌స్సులో అందుకున్నాడు.

ఇక ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో ద‌క్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింట‌న్ డికాక్ అగ్రస్ధానంలో ఉన్నాడు. డికాక్ 22 ఏళ్ల 312 రోజుల్లో ఈ రికార్డును నమోదు చేశాడు. కాగా అఫ్గానిస్తాన్ క్రికెట్ జ‌ట్టు వ‌న్డేల్లో సాధించిన మొత్తం సెంచరీల(30)లో గుర్భాజ్ సాధించినివే  25 శాతం కావ‌డం గ‌మనార్హం.
చదవండి: అదొక పగటి కల.. భారత్‌కు పీసీబీ స్ట్రాంగ్‌ రిప్లై ఇవ్వాలి: పాక్‌ మాజీ కెప్టెన్‌

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)