Breaking News

Australian Open 2023: నాదల్, జొకోవిచ్‌లపైనే దృష్టి

Published on Sun, 01/15/2023 - 05:15

మెల్‌బోర్న్‌: కెరీర్‌లో 23వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)... అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ప్లేయర్‌గా నాదల్‌ పేరిట ఉన్న రికార్డును సమం చేయాలనే పట్టుదలతో నొవాక్‌ జొకోవిచ్‌... రేపటి నుంచి మొదలయ్యే టెన్నిస్‌ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో బరిలోకి దిగనున్నారు. ప్రపంచ రెండో ర్యాంకర్‌ నాదల్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో సోమవారం జరిగే పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో బ్రిటన్‌కు చెందిన 40వ ర్యాంకర్‌ జాక్‌ డ్రేపర్‌తో ఆడనున్నాడు.

మంగళవారం జరిగే తొలి రౌండ్‌లో ప్రపంచ 75వ ర్యాంకర్‌ రొబెర్టో బేనా (స్పెయిన్‌)తో జొకోవిచ్‌ తలపడతాడు. జొకోవిచ్‌ 21 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గగా అందులో 9 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్స్‌ ఉండటం విశేషం. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న జొకోవిచ్‌ ఈసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేతగా నిలిస్తే మళ్లీ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటాడు.  నాదల్, జొకోవిచ్‌ కాకుండా ఏడో సీడ్‌ మెద్వెదేవ్‌ (రష్యా), రెండో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే), మూడో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) టైటిల్‌ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగనున్నారు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)