Breaking News

సెంచరీతో మెరిసిన రవీంద్ర.. బంగ్లాను చిత్తు చేసిన కివీస్‌

Published on Mon, 02/24/2025 - 22:08

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో న్యూజిలాండ్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది. దీంతో కివీస్ తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.  237 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 46.1 ఓవర్లలో చేధించింది.

బ్లాక్‌ క్యాప్స్‌ బ్యాటర్లలో యువ ఆటగాడు రచిన్‌ రవీంద్ర అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. గాయం నుంచి కోలుకుని వచ్చిన తొలి మ్యాచ్‌లోనే రవీంద్ర శతకొట్టాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే స్టార్‌ ప్లేయర్లు విల్‌ యంగ్‌, కేన్‌ విలియమ్సన్‌ వికెట్లు కోల్పోయిన కివీస్‌ను రచిన్‌ ఆదుకున్నాడు.

డెవాన్‌ కాన్వేతో కలిసి స్కోర్‌ను బోర్డును ముందుకు తీసుకు వెళ్లాడు. ఈ క్రమంలో 95 బంతుల్లో తన నాలుగో సెంచరీ మార్క్‌ను రవీంద్ర అందుకున్నాడు. ఓవరాల్‌గా 105 బంతులు ఎదుర్కొన్న రచిన్‌.. 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 112 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు టామ్‌ లాథమ్‌(55), డెవాన్‌ ​కాన్వే(30) రాణించారు. బంగ్లా బౌలర్లలో టాస్కిన్‌ ఆహ్మద్‌, నహిద్‌ రాణా, ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌, రిషాద్‌ తలా వికెట్‌ సాధించారు.

ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 236 పరుగులకే పరిమితమైంది.
కివీస్ బౌలర్లలో స్పిన్నర్ మైఖల్ బ్రేస్‌వెల్ నాలుగు వికెట్ల‌తో స‌త్తాచాటాడు. అతడితో పాటు విలియమ్ ఓ రూర్క్ రెండు, హెన్రీ, జామీసన్‌ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హూస్సేన్ శాంటో(110 బంతుల్లో 9 ఫోర్లతో 77) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జాకర్ అలీ(45), రిషద్ హొస్సేన్(26) రాణించారు.
 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)