Breaking News

తల్లి కళ్లల్లో ఆనందం.. ఈ విజయం ఎంతో ప్రత్యేకం!

Published on Wed, 09/17/2025 - 08:34

సమర్‌కండ్‌ (ఉజ్బెకిస్తాన్‌): క్లిష్టంగా గడుస్తున్న ఈ సంవత్సరంలో తాజా ఫిడే గ్రాండ్‌ స్విస్‌ టైటిల్‌ కొత్త ఉత్సాహాన్నిచ్చిందని భారత గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి రమేశ్‌బాబు తెలిపింది. తాను మరింత మెరుగయ్యేందుకు, రాణించేందుకు ఇది ఔషధంలా పనిచేస్తుందని చెప్పింది. 

మహిళల ఎలైట్‌ ఈవెంట్‌లో వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె ఘనత వహించింది. 24 ఏళ్ల ఈ చెన్నై గ్రాండ్‌మాస్టర్‌ వచ్చే ఏడాది క్యాండిడేట్స్‌ టోర్నీకి సైతం అర్హత సాధించిన సంగతి తెలిసిందే. 

నాకెన్నో గుణపాఠాలు నేర్పాయి
‘గత విజయంతో పోల్చుకుంటే ఇది ముమ్మాటికి కఠినమైంది. 2023లో నేను ఫామ్‌లో ఉన్నాను. నిలకడగా విజయాలు సాధిస్తున్న సమయంలో గ్రాండ్‌ స్విస్‌ టైటిల్‌ గెలవడం ఏమంత కష్టం కాలేదు. కానీ ఇప్పుడు అంతా సులువుగా రాలేదు. 

నేను ఎప్పట్లాగే కష్టపడుతున్నప్పటికీ ఈ ఏడాది ఫలితాలు మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో లభించిన టైటిల్‌ నన్ను మార్చింది. చాలా టోర్నీలలో ఆడటం ద్వారా గత రెండేళ్లుగా ఎంతో అనుభవాన్ని గడించా. అయితే గతేడాది క్యాండిడేట్స్‌ టోర్నీలో వరుసగా నాలుగు గేమ్‌లు ఓడిపోవడం, ఆ తర్వాత మింగుడుపడని ఫలితాలు నాకెన్నో గుణపాఠాలు నేర్పాయి. 

నేనొక ప్లేయర్‌గా మరింత బాగా ఆడేందుకు, ఓ వ్యక్తిగా దృఢంగా తయారయ్యేందుకు దోహదం చేశాయి’ అని వైశాలి పేర్కొంది. ఈ ఏడాది సొంతగడ్డపై జరిగిన చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ టోర్నమెంట్‌లో తొమ్మిది రౌండ్ల పాటు వరుస వైఫల్యాలతో కేవలం 1.5 పాయింట్లే సాధించడం, మహిళల ప్రపంచకప్‌లో క్వార్టర్‌ ఫైనల్లో తన్‌ జొంగ్‌జీ (చైనా) చేతిలో ఓడిపోవడం వైశాలిని కుంగుదీసింది. 

తల్లి కళ్లల్లో ఆనందం
‘చెన్నై టోర్నీలో ఏకంగా ఏడు గేముల్లో ఓడాను. ఇంకా చెప్పాలంటే ఓ వారమంతా ఓటములతోనే గడిచిపోయింది. అప్పుడు ఏదోలా అనిపించింది. మంచో చెడో కూడా అర్థమయ్యేది కాదు. కానీ గెలిస్తే నన్ను ఎవరు ఆపలేరనే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. 

అదే ఇప్పుడు జరిగింది’ అని వైశాలి వివరించింది. ఇక ఫిడే గ్రాండ్‌ స్విస్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత తల్లి నాగలక్ష్మి, తమ్ముడు ప్రజ్ఞానందతో కలిసి వైశాలి సంబరాన్ని పంచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)