Breaking News

ర‌విచంద్ర‌న్ అశ్విన్ విధ్వంసం.. 11 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో! వీడియో

Published on Sat, 08/03/2024 - 14:56

తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టిఎన్‌పిఎల్)-2024లో దిండిగల్ డ్రాగన్స్ కెప్టెన్‌, టీమిండియా వెట‌ర‌న్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. శుక్ర‌వారం ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిజన్స్‌తో జ‌రిగిన క్వాలిఫియ‌ర్‌-2లో అశ్విన్ ఆకాశమే హ‌ద్దుగా చెల‌రేగాడు. 109 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్య చేధ‌న‌లో ఓపెన‌ర్‌గా వ‌చ్చిన అశ్విన్‌.. ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు.

కేవ‌లం 30 బంతులు ఎదుర్కొన్న అశ్విన్‌.. 11 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 69 ప‌రుగులు చేశాడు.  అత‌డి విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఫలితంగా స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని దిండిగ‌ల్ కేవ‌లం 10.5 ఓవ‌ర్లలో ఒక వికెట్ కోల్పోయి చేధించింది. అశ్విన్‌తో పాటు మ‌రో ఓపెన‌ర్ విమ‌ల్ కుమార్ 28 ప‌రుగుల‌తో రాణించాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన ఐడ్రీమ్ తిరుప్పూర్ జ‌ట్టు దిండిగ‌ల్ బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో 108 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. తిరుప్పూర్ బ్యాట‌ర్ల‌లో మ‌న్ భ‌ప్నా(26) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. దిండిగ‌ల్ బౌల‌ర్ల‌లో పి విగ్నేష్ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సుభాత్ భాటీ, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌లా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ విజ‌యంతో దిండిగల్ డ్రాగన్స్ ఫైన‌ల్లో అడుగుపెట్టింది. ఆదివారం జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్లో లైకా కోవై కింగ్స్‌తో దిండిగ‌ల్ డ్రాగ‌న్స్ త‌ల‌ప‌డ‌నుంది.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)