Breaking News

చరిత్ర సృష్టించిన డికాక్‌.. వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలోనే!

Published on Wed, 11/01/2023 - 19:17

వన్డే ప్రపంచకప్‌-2023లో దక్షిణాఫ్రికా స్టార్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా పుణే వేదికగా న్యూజిలాండ్‌పై డికాక్‌ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో  116 బంతులు ఎదుర్కొన్న డికాక్‌.. 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114 పరుగులు సాధించాడు. మొదటిలో కివీస్‌ బౌలర్లను ఆచితూచి ఆడిన డికాక్‌.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 

న్యూజిలాండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు.  ఈ టోర్నీలో డికాక్‌ ఇది నాలుగో సెంచరీ కావడం గమనార్హం. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆడిన 7 మ్యాచ్‌లలో 545 పరుగులు చేసిన డికాక్‌.. లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన డికాక్‌ పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు.

డికాక్‌ సాధించిన రికార్డులు ఇవే..
►ఒక వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన వికెట్‌ కీపర్‌గా డికాక్‌(545) నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక మాజీ వికెట్‌ కీపర్‌ కుమార్ సంగక్కర పేరిట ఉండేది. 2015 వన్డే ప్రపంచకప్‌లో సంగక్కర 541 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్‌తో సంగక్కర రికార్డును క్వింటన్‌ బ్రేక్‌ చేశాడు.

►అదే విధంగా వన్డేప్రపంచకప్‌లలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన వికెట్‌ కీపర్‌గా డికాక్‌ నిలిచాడు. ఇప్పటివరకు వన్డే వరల్డ్‌కప్‌లలో డికాక్‌ 22 సిక్సర్లు సాధించారు. ఈ ఏడాది ఎడిషన్‌లోనే డికాక్‌ 18 సిక్సర్లు కొట్టడం గమనార్హం. కాగా అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌(19) పేరిట ఉండేది.
చదవండి: CWC 2023: వరల్డ్‌కప్‌లో ఘోర ప్రదర్శన. ఇంగ్లండ్‌ క్రికెటర్‌ సంచలన నిర్ణయం! క్రికెట్‌కు గుడ్‌బై

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)