చరిత్ర సృష్టించిన పీవీ సింధు

Published on Thu, 01/22/2026 - 14:12

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌, ఒలింపిక్‌ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు ఇండోనేషియా మాస్టర్స్‌-2026 టోర్నమెంట్లో అద్భుత విజయం సాధించింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో డెన్మార్క్‌ షట్లర్‌ ఫో లినే హోజ్‌మార్క్‌ జేర్‌ఫీల్డ్‌ను 21-19, 21-18 తేడాతో ఓడించింది. నలభై మూడు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు పైచేయి సాధించి.. క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది.

500వ విజయం
ఈ క్రమంలోనే పీవీ సింధు అరుదైన మైలురాయికి చేరుకుంది. ఈ మ్యాచ్‌ సందర్భంగా తన కెరీర్‌లో 500వ విజయాన్ని ఆమె నమోదు చేసింది. తద్వారా మహిళల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన భారత తొలి షట్లర్‌గా చరిత్ర సృష్టించిన సింధు.. ఓవరాల్‌గా ఆరో బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా నిలిచింది.

ఇక ఇండోనేషియా మాస్టర్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో 13వ ర్యాంకర్‌ అయిన సింధు.. వరల్డ్‌ నంబర్‌ 4, చైనాకు చెందిన చెన్‌ యూ ఫీ రూపంలో గట్టి పోటీ ఎదుర్కోనుంది. వీరిద్దరు ఇప్పటి వరకు పదమూడు సార్లు ముఖాముఖి తలపడగా 7-6తో చెన్‌ ఆధిక్యంలో ఉంది. చివరగా 2019లో చెన్‌ను సింధు ఓడించింది.

లక్ష్య సేన్‌ సైతం
మరోవైపు.. లక్ష్య సేన్‌ సైతం ఇండోనేషియా మాస్టర్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. అరగంటకు పైగా సాగిన పోరులో హాంకాంగ్‌ షట్లర్‌ జేసన్‌ గునావన్‌పై 21-20, 21-11 తేడాతో గెలిచి లక్ష్య సేన్‌ ముందుడుగు వేశాడు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)