Breaking News

మలేషియా మాస్టర్స్‌ ఫైనల్లో పీవీ సింధు..

Published on Sat, 05/25/2024 - 18:07

మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భార‌త స్టార్ షెట్ల‌ర్‌, తెలుగు తేజం పీవీ సింధు త‌న జోరును కొన‌సాగిస్తోంది. ఈ టోర్నీ టైటిల్‌కు అడుగు దూరంలో సింధు నిలిచింది. శ‌నివారం జ‌రిగిన‌ సెమీఫైన‌ల్లో థాయ్‌లాండ్ ప్లేయ‌ర్ బుసాన‌న్‌పై 13-21, 21-16, 21-12 పాయింట్ల తేడాతో సింధు ఘ‌న విజ‌యం సాధించింది. 

తొలి రౌండ్ నుంచే బుసాన‌న్‌పై సింధూ ఆధిపత్యం చెలాయించింది. మొత్తంగా ప్ర‌త్య‌ర్ధిని ఓడించ‌డానికి సింధూకు  2 గంటల 28 నిమిషాల స‌మ‌యం పట్టింది. ఈ ఏడాది మాస్టర్స్ టోర్నీలో సింధూ ఫైన‌ల్ అర్హ‌త సాధించ‌డం ఇదే తొలి సారి కావ‌డం గ‌మ‌నార్హం. 

సింధూ చివ‌ర‌గా గ‌త ఏడాది మాడ్రిడ్ స్పెయిన్ మాస్ట‌ర్స్ ఫైన‌ల్‌కు చేరింది.  కాగా 2019లో హాంకాంగ్ ఓపెన్‌లో సింధూను బుసానన్ ఓడించి టైటిల్ సాధించింది. తాజా విజ‌యంతో సింధూ త‌న ఓట‌మికి బ‌దులు తీర్చుకుంది. ఇక ఆదివారం జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్‌లో చైనా ప్లేయ‌ర్ వాంగ్ ఝీయితోస సింధూ త‌ల‌ప‌డ‌నుంది.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)