సింధుకు షాక్‌

Published on Thu, 01/23/2025 - 04:02

జకార్తా: ఈ ఏడాది బరిలోకి దిగిన రెండో టోర్నమెంట్‌లోనూ భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఇండియా ఓపెన్‌–750 టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించిన సింధు... ఇండోనేసియా మాస్టర్స్‌ –500 టోర్నమెంట్‌లో తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 32వ ర్యాంకర్‌ థుయి లిన్‌ నుయెన్‌ (వియత్నాం) 22–20, 21–12తో సింధుపై సంచలన విజయం సాధించింది.

గతంలో సింధుతో ఆడిన రెండుసార్లూ (2022 సింగపూర్‌ ఓపెన్, 2023 ఆర్క్‌టిక్‌ ఓపెన్‌) ఓడిపోయిన నుయెన్‌ మూడో ప్రయత్నంలో గెలుపు రుచి చూసింది. 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో స్కోరు 14–20 వద్ద నుయెన్‌ ఒక్కసారిగా చెలరేగిపోయింది. వరుసగా 8 పాయింట్లు గెలిచి గేమ్‌ను సొంతం చేసుకుంది. చేజేతులా తొలి గేమ్‌ను చేజార్చుకున్న సింధు రెండో గేమ్‌లో తడబడింది. 

ఆరంభంలోనే 1–6తో వెనుకబడిన సింధు ఆ తర్వాత కోలుకోలేకపోయింది. మహిళల సింగిల్స్‌లో పోటీపడ్డ ఇతర భారత క్రీడాకారిణులు ఆకర్షి కశ్యప్, అనుపమ ఉపాధ్యాయ్, రక్షిత శ్రీ, తాన్యా హేమంత్‌ కూడా తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు. 

ఆకర్షి 10–21, 13–21తో ప్రపంచ మాజీ చాంపియన్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌) చేతిలో, అనుపమ 12–21, 5–21తో పారిస్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్‌ (ఇండోనేసియా) చేతిలో, తాన్యా 14–21, 11–21తో ప్రపంచ మాజీ చాంపియన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో, రక్షిత శ్రీ 17–21, 19–21తో టొమోక మియకాజి (జపాన్‌) చేతిలో పరాజయం పాలయ్యారు.
 
మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప (భారత్‌) ద్వయం 21–6, 21–14తో ఒర్నిచా–సుకిత్త (థాయ్‌లాండ్‌) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. 
 
మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో గద్దె రుత్విక శివాని–రోహన్‌ కపూర్‌ (భారత్‌) జోడీ 9–21, 13–21తో గ్రెగొరీ మేర్స్‌–జెన్నీ మేర్స్‌ (ఇంగ్లండ్‌) జంట చేతిలో ఓడిపోగా... ధ్రువ్‌ కపిల–తనీషా క్రాస్టో (భారత్‌) ద్వయం 21–18, 21–14తో అద్నాన్‌ మౌలానా–ఇందా చాయసారి (ఇండోనేసియా) జోడీపై గెలిచింది.  

లక్ష్య సేన్‌ ముందంజ 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత నంబర్‌వన్‌ లక్ష్య సేన్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్‌లో లక్ష్య సేన్‌ 21–9, 21–14తో ఒబయాషి (జపాన్‌)పై నెగ్గాడు. 

ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో కిరణ్‌ జార్జి (భారత్‌) 12–21, 10–21తో హైక్‌ జిన్‌ జియోన్‌ (కొరియా) చేతిలో, ఆయుశ్‌ శెట్టి (భారత్‌) 19–21, 19–21తో షి యుకి (చైనా), ప్రియాన్షు (భారత్‌) 14–21, 21–13, 18–21తో కొడాయ్‌ నరోకా (జపాన్‌) చేతిలో ఓటమి పాలయ్యారు.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)