Breaking News

సింధుకు మళ్లీ నిరాశే

Published on Thu, 07/17/2025 - 03:56

టోక్యో: ఈ ఏడాది భారత బ్యాడ్మింటన్‌ స్టార్, ప్రపంచ మాజీ చాంపియన్‌ పీవీ సింధు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీ నుంచి ప్రపంచ 16వ ర్యాంకర్‌ సింధు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. ప్రపంచ 14వ ర్యాంకర్‌ సిమ్‌ యు జిన్‌ (దక్షిణ కొరియా)తో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో 30 ఏళ్ల సింధు 15–21, 14–21తో ఓడిపోయింది. గతంలో సిమ్‌ యు జిన్‌తో ఆడిన మూడుసార్లూ గెలిచిన సింధు నాలుగో ప్రయత్నంలో తొలిసారి ఓటమి చవిచూసింది. 

38 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో ఒకదశలో 3–9తో వెనుకబడింది. ఆ తర్వాత తేరుకొని ఆధిక్యాన్ని 12–13కు తగ్గించింది. అయితే కీలకదశలో కొరియా ప్లేయర్‌ పైచేయి సాధించి సింధుకు అవకాశం ఇవ్వలేదు. ఇక రెండో గేమ్‌లో మూడుసార్లు ఇద్దరి స్కోరు సమమయ్యాయి. స్కోరు 11–11వద్ద ఉన్నపుడు సిమ్‌ యు జిన్‌ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 15–11తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని సింధుపై ఆమె తొలిసారి విజయాన్ని అందుకుంది. 

ఈ ఏడాది సింధు ఇండోనేసియా మాస్టర్స్, ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్, స్విస్‌ ఓపెన్, మలేసియా మాస్టర్స్‌ టోర్నీల్లోనూ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. తదుపరి సింధు వచ్చే మంగళవారం మొదలయ్యే చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. మరోవైపు భారత్‌కే చెందిన ఉన్నతి హుడా 8–21, 12–21తో చోచువోంగ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడిపోగా... అనుపమ 21–15, 18–21, 21–18తో సహచరిణి రక్షిత శ్రీపై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరింది.  

సాత్విక్‌–చిరాగ్‌ జోడీ శుభారంభం 
పురుషుల డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్‌లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 21–18, 21–10తో కాంగ్‌ మిన్‌ హైయుక్‌–కి డాంగ్‌ జు (దక్షిణ కొరియా) జోడీని ఓడించింది. రూబన్‌ కుమార్‌–హరిహరన్‌ (భారత్‌) ద్వయం 15–21, 9–21తో కిమ్‌ వన్‌ హో–సియో సెయుంగ్‌ జే (దక్షిణ కొరియా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో లక్ష్య సేన్‌ (భారత్‌) 21–11, 21–18తో వాంగ్‌ జెంగ్‌ జింగ్‌ (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)