Breaking News

అదరగొట్టిన పీవీ సింధు, లక్ష్య సేన్‌

Published on Sat, 07/08/2023 - 09:14

కాల్గరీ: కెనడా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో లక్ష్య సేన్‌... మహిళల సింగిల్స్‌ విభాగంలో పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు.

శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో లక్ష్య సేన్‌ 21–15, 21–11తో వైగోర్‌ కొల్హో (బ్రెజిల్‌)పై నెగ్గగా... సింధుకు ఆమె ప్రత్యర్థి నత్సుకి నిదైరా (జపాన్‌) నుంచి వాకోవర్‌ లభించింది. పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో విష్ణువర్ధన్‌–కృష్ణప్రసాద్‌ ద్వయం 9–21, 11–21తో రెండో సీడ్‌ అహసాన్‌–సెతియవాన్‌ (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడింది. 

బ్రిజ్‌భూషణ్‌కు కోర్టు సమన్లు 
న్యూఢిల్లీ: రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిశీలించిన ఢిల్లీ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ హర్జీత్‌ సింగ్‌ జస్పాల్‌ ఈ కేసులో విచారించేందుకు తగిన సాక్ష్యాధారాలున్నాయని తెలిపారు. ఈ నెల 18న కోర్టు ముందు హాజరు కావాలని బ్రిజ్‌భూషణ్‌కు సమన్లు జారీ చేశారు.  

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)