Breaking News

39 నిమిషాల్లో సింధు కథ ముగిసే.. క్వార్టర్స్‌లో ఓటమి

Published on Fri, 08/04/2023 - 13:16

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత టాప్‌ మహిళా షట్లర్‌ పీవీ సింధు కథ ముగిసింది. ఈ సీజ‌న్‌లో నాలుగోసారి సెమీస్‌లో అడుగుపెట్టాలనుకున్న సింధు ఆశ‌ల‌కు బీవెన్‌ జాంగ్ బ్రేక్ వేసింది. శుక్రవారం ఉదయం జరిగిన క్వార్ట‌ర్‌ ఫైనల్లో అమెరికాకు చెందిన బీవెన్ జాంగ్ చేతిలో 21-12, 21-17తో ఓటమిపాలైంది. కేవలం 39 నిమిషాల్లోనే సింధు తన గేమ్‌ను ప్రత్యర్థి చేతిలో పెట్టి ఓటమిని అంగీకరించింది.

గ‌తంలో జాంగ్‌తో జ‌రిగిన 10 మ్యాచుల్లో ఆరు సార్లు సింధునే గెలిచింది. కానీ శుక్ర‌వారం నాటి మ్యాచ్‌లో 33 ఏళ్ల చైనా అమెరిక‌న్ ప్లేయ‌ర్ చేతిలో ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు.  2019 వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ అయిన సింధు.. ఇటీవ‌ల గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగింది. అయితే ఈ ఏడాది జ‌రిగిన 12 బీడ‌బ్ల్యూఎఫ్ వ‌ర‌ల్డ్ టూర్ టోర్నీల్లో ఏడింటిలో ఆమె ఒక్కదాంట్లో కూడా ఫైనల్‌కు చేరలేదు.

పీవీ సింధు ప్ర‌స్తుతం 17వ ర్యాంక్‌లో ఉంది. ఆగ‌స్టు 21 నుంచి డెన్మార్క్‌లోని కోపెన్‌హెగ‌న్‌లో వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ మెగా టోర్నీకి ముందు సింధు ఇలా పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. 2003లో ఆల్ ఇంగ్లండ్ చాంపియ‌న్ అయిన మ‌హ‌మ్మ‌ద్ హ‌ఫీజ్ హ‌సీమ్ వ‌ద్ద ప్ర‌స్తుతం సింధు శిక్ష‌ణ తీసుకుంటోంది.

చదవండి: Yuzvendra Chahal: 'నిన్నెవరు వెళ్లమన్నారు.. వెనక్కి వచ్చేయ్‌'.. రూల్స్‌ ఒప్పుకోవు

Lionel Messi: ఏ ముహూర్తంలో జాయిన్‌ అయ్యాడో కానీ అంతా శుభమే..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)