Breaking News

PV Sindhu: తన ప్రేమ కథను బయట పెట్టిన సింధు

Published on Wed, 12/25/2024 - 15:21

భార‌త బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు(Pv Sindhu) వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన 29 ఏళ్ల వెంకట దత్త సాయితో సింధు వివాహం ఆదివారం(డిసెంబ‌ర్ 22) అంగరంగ వైభవంగా జరిగింది.  ఉదయ్‌పూర్‌ వేదికగా జరిగిన తమ పెళ్లి ఫోటోలను సింధు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

అందుకు హృదయం’ ఎమోజీని జత చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరలవుతున్నాయి. అయితే తాజాగా సింధు ఓ ఇంటర్వ్యూలో వెంకట సాయితో తన లవ్‌ స్టోరీని బయటపెట్టింది. ఓ విమాన ప్రయాణం తమద్దరిని కలిపిందని సింధు తెలిపింది. వోగ్ ఇండియా రిపోర్ట్‌ ప్రకారం.. అక్టోబర్ 2022లో తొలిసారి వెంకట దత్త సాయిని  సింధు కలిసినట్లు తెలుస్తోంది.

రెండేళ్ల కిందట మేమిద్దరం కలిసి ఒకే విమానంలో ప్రయాణించాం. ఆ ప్రయాణంతో అంతామారిపోయింది. ఆ జర్నీ మమ్మల్ని మరింత దగ్గర చేసింది. అదంతా లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌లా అన్పించింది. అప్పటి నుంచి మా లవ్ జర్నీ మొదలైంది. మా నిశ్చితార్థం కూడా అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది.

మాజీవితంలో అతి ముఖ్యమైన ఘట్టాన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. అది చాలా భావోద్వేగభరిత క్షణం. ఒక ప్రొఫెషనల్ అథ్లెట్‌గా నాకు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికి.. నా జీవితంలో జరిగే ముఖ్యమైన ఘట్టం కోసం అన్ని ముందే ప్లాన్ చేశాను. అందుకు దత్తా కూడా తనవంతు సాయం చేశాడని ఓ ఇంటర్వ్యూలో సింధు పేర్కొంది.
చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన భారత్‌.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)