Breaking News

ఫైనల్లో పీవీ సింధు

Published on Sun, 12/01/2024 - 02:46

లక్నో: భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సయ్యద్‌ మోడీ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. పారిస్‌ ఒలింపిక్స్‌ తర్వాత ఆడిన టోర్నీల్లో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించని సింధు ఈ టోర్నీలో నిలకడైన ప్రదర్శనతో తుది పోరుకు అర్హత సాధించింది. బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 టోర్నీ మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో శనివారం సింధు 21–12, 21–9తో భారత్‌కే చెందిన 17 ఏళ్ల ఉన్నతి హుడాపై విజయం సాధించింది. 

36 నిమిషాల్లో ముగిసిన పోరులో సింధు పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ ప్రత్యర్థిని వరుస గేమ్‌ల్లో చిత్తు చేసింది. సింధు పవర్‌ ముందు నిలవలేకపోయిన ఉన్నతి పదే పదే తప్పులు చేస్తూ మ్యాచ్‌ను కోల్పోయింది. ‘ఈ ప్రదర్శనతో ఆనందంగా ఉన్నా. మ్యాచ్‌ ఆరంభం నుంచే ఆధిక్యం కనబర్చా. పూర్తి ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడా. దానికి ఫలితం దక్కింది. ఉన్నతి శాయశక్తులా ప్రయత్నించింది. 

కానీ నేను ఆమెకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తను వర్ధమాన షట్లర్‌. భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని ఆశిస్తున్నా’అని సింధు పేర్కొంది. ఆదివారం జరగనున్న మహిళల సింగిల్స్‌ ఫైనల్లో చైనా షట్లర్‌ వు లువో యుతో సింధు తలపడనుంది.  

లక్ష్యసేన్‌ ముందంజ.. 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత స్టార్‌ లక్ష్య సేన్‌ ఫైనల్లో అడుగుపెట్టాడు. సెమీఫైనల్లో లక్ష్యసేన్‌ 21–8, 21–14తో షొగో ఒగావా (జపాన్‌)పై వరుస గేమ్‌ల్లో విజయం సాధించాడు. ఆరంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన లక్ష్యసేన్‌ సులువుగా మ్యాచ్‌ను ముగించాడు. మరో సెమీఫైనల్లో ప్రియాన్షు రజావత్‌ 13–21, 19–21తో జియా హెంగ్‌ జాసో (ఇండోనేíÙయా) చేతిలో పరాజయం పాలయ్యాడు. 

ఆదివారం పురుషుల సింగిల్స్‌ తుది పోరులో జియా హెంగ్‌తో లక్ష్యసేన్‌ అమీతుమీ తేల్చుకోనున్నాడు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్‌) జంట ఫైనల్‌కు చేరగా... అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్‌) జోడీ సెమీస్‌లో ఓడింది. 

గాయత్రి–ట్రెసా 18–21, 21–18, 21–10తో బెనీపా – నున్తకర్న్‌ (థాయిలాండ్‌)పై గెలుపొందగా...టాప్‌ సీడ్‌ అశ్విని – తనీషా 21–14, 16–21, 13–21 తేడాతో లి జింగ్‌ – లి ఖియాన్‌ చేతిలో ఓడారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తనీషా క్రాస్టో–ధ్రువ్‌ కపిల (భారత్‌) జోడీ కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్‌లో ఐదో సీడ్‌ తనీషా–ధ్రువ్‌ జంట 21–16, 21–15తో జీ హాంగ్‌ జూ–జియా యీ యాంగ్‌ (చైనా) ద్వయంపై గెలిచింది.   

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)