Breaking News

సింధుకు షాక్‌

Published on Thu, 09/11/2025 - 04:21

హాంకాంగ్‌: ఈ ఏడాది తొలి టైటిల్‌ కోసం భారత స్టార్‌ ప్లేయర్‌ పీవీ సింధు వేట ఇంకా కొనసాగనుంది. హాంకాంగ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ –500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో ప్రపంచ 14వ ర్యాంకర్‌ సింధు తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. ప్రపంచ 27వ ర్యాంకర్, అన్‌సీడెడ్‌ లినె క్రిస్టోఫర్సన్‌ (డెన్మార్క్‌)తో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సింధు 21–15, 16–21, 19–21తో ఓటమి పాలైంది. 

గతంలో లినె క్రిస్టోఫర్సన్‌తో ఆడిన ఐదుసార్లూ విజయం సాధించిన సింధు ఆరోసారి మాత్రం ఓటమి తప్పలేదు. 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు నిర్ణాయక మూడో గేమ్‌లో 16–13తో, 17–15తో ఆధిక్యంలోకి వెళ్లి విజయం దిశగా సాగింది. ఈ కీలక తరుణంలో సింధు అనవసర తప్పిదాలు చేయడం... 15–17తో వెనుకబడిన లినె వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి ఒక్కసారిగా 19–17తో ముందంజ వేసింది. 

ఆ తర్వాత సింధు ఒక పాయింట్‌ గెలిచినా... ఆ వెంటనే లినె రెండు పాయింట్లు నెగ్గి తన కెరీర్‌లో తొలిసారి భారత స్టార్‌పై విజయాన్ని ఖాయం చేసుకుంది. భారత్‌కే చెందిన అనుపమ, రక్షిత శ్రీ కూడా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. అనుపమ 17– 21, 22–20, 14–21తో తొమ్మిదో ర్యాంకర్‌ టొమోకా మియకాజి (జపాన్‌) చేతిలో, రక్షిత శ్రీ 13–21, 7–21తో ప్రపంచ మాజీ చాంపియన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడిపోయారు. 

లక్ష్య సేన్, ప్రణయ్‌ ముందంజ 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో బరిలోకి దిగిన నలుగురు భారత క్రీడాకారులు లక్ష్య సేన్, ప్రణయ్, కిరణ్‌ జార్జి, ఆయుశ్‌ శెట్టి శుభారంభం చేశారు. తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో లక్ష్య సేన్‌ 22–20, 16–21, 21–15తో వాంగ్‌ జు వె (చైనీస్‌ తైపీ)పై, ప్రణయ్‌ 21–17, 21–14తో లు గ్వాంగ్‌ జు (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యారు. కిరణ్‌ జార్జి 21–16, 21–11తో జియా హెంగ్‌ జేసన్‌ (సింగపూర్‌)పై, ఆయుశ్‌ 15–21, 21–19, 21–13తో సు లి యాంగ్‌ (చైనీస్‌ తైపీ)లపై నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నారు. 

మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో రుతపర్ణ–శ్వేతాపర్ణ (భారత్‌) ద్వయం 21–17, 21–9తో పాంగ్‌ వనెస్సా–వాంగ్‌ సమ్‌ (హాంకాంగ్‌) జంటను ఓడించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో గద్దె రుత్విక శివాని–రోహన్‌ (భారత్‌) జోడీ 14–21, 17–21తో ప్రపంచ రెండో ర్యాంక్‌ జంట ఫెంగ్‌ యాన్‌ జె–హువాంగ్‌ డాంగ్‌ పింగ్‌ (చైనా) చేతిలో... తనీషా క్రాస్టో–ధ్రువ్‌ కపిల (భారత్‌) ద్వయం 16– 21, 11–21తో చెన్‌ చెంగ్‌ కువాన్‌–సు యిన్‌ హుయ్‌ (చైనీస్‌ తైపీ) జంట చేతిలో ఓడిపోయాయి.  

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)