Breaking News

శభాష్‌ సింధు 

Published on Mon, 07/20/2026 - 05:19

19 నెలల నిరీక్షణకు తెరదించుతూ అంతర్జాతీయ వేదికపై భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు విజయగర్జన చేసింది. జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో సింధు చాంపియన్‌గా అవతరించింది. తద్వారా 44 ఏళ్ల చరిత్ర కలిగిన జపాన్‌ ఓపెన్‌లో టైటిల్‌ గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా ఈ తెలుగు తేజం రికార్డు 
సృష్టించింది. 1983లో ఇదే టోర్నీలో భారత దిగ్గజం ప్రకాశ్‌ పదుకొనె పురుషుల సింగిల్స్‌లో రన్నరప్‌గా నిలిచాడు.  

టోక్యో: తన ప్రియమైన ప్రత్యర్థి అకానె యామగుచిపై భారత స్టార్‌ పీవీ సింధు పైచేయి సాధించింది. ఆదివారం ముగిసిన జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో సింధు విజేతగా నిలిచింది. 50 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్‌ సింధు 21–17, 21–17తో ప్రపంచ మూడో ర్యాంకర్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ అకానె యామగుచి (జపాన్‌)పై జయభేరి మోగించింది. 

విజేత సింధుకు 66,500 డాలర్ల (రూ. 64 లక్షల 15 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 11,000 ర్యాంకింగ్‌ పాయింట్లు... రన్నరప్‌ యామగుచికి 32,300 డాలర్ల (రూ. 31 లక్షల 16 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9,350 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. సింధు, యామగుచి ఇప్పటి వరకు 30 సార్లు తలపడ్డారు. సింధు 16 సార్లు... యామగుచి 14 సార్లు విజయం సాధించారు. సింధు ఓవరాల్‌ కెరీర్‌లో ఇది 25వ సింగిల్స్‌ టైటిల్‌. ఈ ఏడాది మాత్రం ఆమెకిదే తొలి టైటిల్‌ కావడం గమనార్హం. 2024 నవంబర్‌లో లక్నోలో జరిగిన సయ్యద్‌ మోదీ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 టోర్నీలో చివరిసారి సింధు టైటిల్‌ గెలుచుకుంది.  

ఆధిక్యం దోబూచులాడుతూ... 
ఆరోసారి జపాన్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరిన యామగుచిపై తుదిపోరులో సింధు ఆటతీరు చూశాక స్పష్టమైన ప్రణాళికతో వచ్చినట్లు అనిపించింది. అవసరమైనపుడు ర్యాలీలను తక్కువ షాట్‌లలో ముగిస్తూ... కొన్నింటిని సుదీర్ఘంగా కొనసాగిస్తూ సింధు పైచేయి సాధించింది. కొన్ని ర్యాలీలు 38 షాట్‌లు, 37 షాట్‌లు, 31 షాట్‌ల వరకు కొనసాగాయి. ఆరంభంలో సింధు 9–5తో ముందంజ వేసింది. ఆ తర్వాత 9–11తో వెనుకబడింది. 

స్కోరు 11–12 వద్ద సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 16–12తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత యామగుచి పుంజుకోవడంతో స్కోరు 17–17తో సమైమంది. ఈ దశలో సింధు మరోసారి విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 21–17తో తొలి గేమ్‌ను 23 నిమిషాల్లో దక్కించుకుంది. రెండో గేమ్‌ ఆరంభంలో సింధు కళ్లు చెదిరే స్మాష్‌లు సంధించింది. 8–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత యామగుచి తేరుకొని ఆధిక్యాన్ని 8–7కు తగ్గించింది. ఈ దశలో సింధు మళ్లీ మెరిసింది. వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 14–7తో దూసుకెళ్లింది. 

అనంతరం యామగుచి కోలుకోవాలని ప్రయత్నించినా సింధు కీలకదశలో పాయింట్లు సాధించి రెండో గేమ్‌ను 27 నిమిషాల్లో సొంతం చేసుకొని మ్యాచ్‌తోపాటు టైటిల్‌ను కైవసం చేసుకుంది. ‘చాలా ఆనందంగా ఉంది. మాటలు రావడం లేదు. నా కళ్లలో ఆనందభాష్పాలు వచ్చాయి. ఎందుకంటే ఈ విజయం నాకెంతో అవసరం. 19 నెలల తర్వాత టైటిల్‌ సాధించాను. ఈ గెలుపు నాలో ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచుతుంది. అనవసర తప్పిదాలు చేయకుండా, సంయమనం కోల్పోకుండా ఆడినందుకు మంచి ఫలితం వచ్చింది. కొత్త కోచ్‌ ఇర్వన్‌సి ఆది ప్రతమ, స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ వేన్‌ లోంబార్డ్, సహాయక సిబ్బంది, తల్లిదండ్రులు, నా భర్త వెంకటదత్త సాయికి ధన్యవాదాలు’ అని విజయానంతరం సింధు వ్యాఖ్యానించింది.  

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)